Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహశీల్దార్, కమిషనర్, ఎంఈఓ, సీఐలకు అఖిలపక్షం వినతులు
నవతెలంగాణ-ఇల్లందు
మెయిన్ రోడ్ స్కూల్ స్థలంలో మున్సిపాలిటి స్ట్రీట్ వెండర్స్‌కు షాపులు కట్టొద్దని, వేరే స్థలాలలో కట్టుకోమని ఇల్లందు అఖిల పక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వ పాఠశాల, దేవాలయం లాంటిదని అక్కడ వ్యాపారాలు చేయడం సరైంది కాదని అఖిలపక్షం స్థానిక తహశీల్దార్ కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, పోలీస్ ఇన్స్పెక్టర్ బరపటి రమేష్, ఎంఈఓ పిల్లి శ్రీనివాసరావులకు బుధవారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం అఖిపక్ష నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ విద్యా సంస్థల అధినేత అయిన దమ్మాలపాటి వెంకటేశ్వర రావు విద్యాలయ పరిసరాల్లో వ్యాపారాలు చేయడం కోసం కాంప్లెక్స్ కట్టడమంటే ప్రభుత్వ పాఠశాల అక్కడ లేకుండా చేయాలని చూస్తున్నారా? అనే అనుమానం కలుగుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాఠశాల గోడ యథావిదిగా నిర్మించి విద్యాలయం పట్ల తనకున్న అనుబంధాన్ని నిరూపించాలని కోరారు. ఈ విషయంలో అఖిలపక్షం ఎంతటి ఆందోళన కైనా వెనకాడదని దానికి చైర్మన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం అబ్దుల్ నబి, తాళ్లూరి కృష్ణ, సీపీఐ బంధం నాగయ్య, కాంగ్రెస్ దొడ్డ డానియల్, టీడీపీ ముద్రగడ వంశీ, సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రేసు బోసు, ఎంఎల్ న్యూ డెమోక్రసీ రామ్ సింగ్, యాకూబ్ షావలి, బీజేపీ దోమల మహేష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.