Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం లీగల్
దేశంలో కోవిడ్ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశంలోని అన్ని కోర్టులు జూన్ 30 వరకు ఫిజికల్ అపిరియన్స్కు అనుమతించకుండా కేవలం వర్చువల్ మోడ్‌లో మాత్రమే కక్షిదారులు, న్యాయవాదులు కోర్టుకు హాజరు కాకుండా, ఆన్లైన్లో మాత్రమే కేసు వాయిదాలు జరపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులు అమలు చేస్తున్న భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కోర్టు ఈ నిభందనలు పాటించకుండా, సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈ నెల 11, 14 తేదీన కూడా కోర్టు నడపుటకు షెడ్యూలు ఇవ్వడంపై బార్ అసోసియేషన్ కార్యవర్గం తీవ్రంగా ఖండించింది. కొత్తగూడెం కోర్టులో కోవిడ్‌తో 35 మంది న్యాయవాదులు ఇబ్బందులు పడ్డారని, సీనియర్ న్యాయవాదులు వయస్సు రీత్యా ఫిజికల్ అపిరియన్స్ కు వస్తే కరోనా బారిన పడితే ప్రాణాపాయం ఉండే ఆవకాశం ఉంటుందని, కోర్టు కేసులు వాయిదా వేయాలని కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. కోర్టులో నల్ల బ్యాడ్జ్ ధరించి నిరసన తెలిపారు. రోజుకు 25 కేసులు విచారించే క్రమంలో కేసుకు ఇద్దరు లాయర్లు, నలుగురు కక్షిదారులు కలిపి కనీసం 150 మంది జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి ఒకచోటికి హాజరయితే కరోనాను ఎవరు ఆపాలని, బాథ్యత గల జిల్లా కలెక్టర్యే ఇలా ప్రభుత్వ ఆదేశాలను, సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరించడపట్ల అసోసియేషన్ కార్యవర్గం మండిపడింది. ఈ నిరసన కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నీరుకోండ వెంకట రాజేష్, సంయుక్త కార్యదర్శి కాసాని రమేష్, కోశాధికారి మహ్మద్ సాదిక్ పాషా, లైబ్రరీ సెక్రటరీ అరకల కరుణకర్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ సంతోష్ సాహు, సినియర్ న్యాయవాదులు కటకం పుల్లయ్య, తుమ్మల శివారెడ్డి, పెసరపల్లి నాగేశ్వరరావు, పిల్లి వేణువాసరావు, అంబటి రమేష్, సింగు ఉపేందర్, దూదిపాళ్ల రవి కుమార్, మారపాక రమేష్, అంకం మల్లేష్, దూడేం మురళి, తదితరులు పాల్గొన్నారు.