Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఖర్చులు కూడా రాక రైతులు దివాళా
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు ఏ మాత్రం సహేతుకంగా లేవని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సున్నా నాగేశ్వరరావు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫారసులను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయాలన్నారు. పరి ధాన్యం క్వింటాలు రు.2,768, పత్తికి రు.9,954 ఉత్పత్తి వ్యయం అయితే కేంద్రం వరికి రు.1,964, పత్తికి రు.6,026 ప్రకటించిందని, ఈ మద్దతు ధరలు రైతులను లాభదాయకంగా మారుస్తాయా, అప్పుల ఊబిలోకి ఈడుస్తాయా అని ప్రశ్నించారు. ఈ కంటి తుడుపు ధరలు కూడా ఆచరణలో అమలు కావనేది అందరికి తెలిసిందేనన్నారు. కేంద్రం ప్రకటించిన ధరలతో రైతులు వరికి క్వింటాకు సుమారు 800 రూ.లు, పత్తికి 3,929 రూ.లు నష్టపోతు న్నారని తెలిపారు. దేశవ్యాపితంగా ఉత్పత్తి ఖర్చులను పరిగణనలోకి తీసుకొని స్వామినాథన్ చెప్పినట్లు 50 శాతం అదనంగా గిట్టుబాటు ధర ఇస్తున్నట్లు మోదీ ప్రభుత్వం ప్రకటించుకోవటం సిగ్గుచేటన్నా రు. రైతులను దగా చేసే ప్రకటనల ను రైతులు నమ్మబోరన్నారు. ఉత్పత్తి ఖర్చులే యివ్వలేని వారు గిట్టుబాటు ధర యిస్తున్నట్లు చెప్పటం మోసపూరితం అన్నారు. గత యేడాదితో పోలిస్తే ఒక్క డీజిల్పైన పెంచిన ధరల వలన ఎకరాకు 1,600 రూ.లు అదనపు భారం పడుతోందని, 72 రూ.లు క్వింటాల్ కు పెంచటం వ్యవసాయాన్ని నాశనం చేయటానికేనన్నారు. కెసిఆర్ ప్రభుత్వం కనీసం ఉత్పత్తి ఖర్చులు రాబట్టటానికైనా కేంద్రం పై పోరాడాలన్నారు.