Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందడపు సాయిబాబు
నవతెలంగాణ-వైరా టౌన్
సీఐటీయు వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం వైరాలోని బాట్లింగ్ హమాలీలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సిఐటియు వైరా పట్టణ కన్వీనర్ అనుమోలు రామారావు అధ్యక్షతన జరిగిన సభలో సీఐటియు రాష్ట్ర కార్యదర్శి మందడపు సాయిబాబు మాట్లాడుతూ సీఐటియు పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మికులు ఆందోళన చేస్తున్నారని అన్నారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కార్మికుల హక్కులను హరించే నాలుగు కార్మిక కోడులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా టీకాను దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా వేయాలని, దేశంలోని పేదలందరికీ నెలకు యాభై కిలోల బియ్యం, రూ.7500లను పది నెలల పాటు ఇవ్వాలని, కోవిడ్ కారణంగా చనిపోయిన కార్మికులకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. ఫ్రంట్ లైన్ వర్కర్సుగా పనిచేస్తున్న ఆశా, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ ఉద్యోగులకు, ఏఎన్ఎంలకు 50 లక్షలు బీమా సౌకర్యం కల్పించాలని, కోవిడ్ విధులు నిర్వహిస్తూ చనిపోయిన ఫ్రంట్ లైన్ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటియు జిల్లా నాయకులు సుంకర సుధాకర్, వైరా రూరల్ మండల కన్వీనర్ తోట నాగేశ్వరరావు, బాట్లింగ్ హమాలీలు పట్టయ్య , రవికుమార్, సైదులు, కష్ణ, నాగేశ్వరరావు, మహమ్మద్, జమలయ్య తదితరులు పాల్గొన్నారు.
భవన నిర్మాణ కార్మికులను తక్షణమే ఆదుకోవాలి
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదాం శ్రీనివాస్ రావు
గాంధీచౌక్ : ఖమ్మం పట్టణంలోని గాంధీచోక్ లో భవన నిర్మాణ కార్మికుల ను తక్షణమే ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదాం శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. గత 2020 మార్చి నుండి 2021 జూన్ వరకు కోవిడ్ -19 కారణంగా భవన నిర్మాణ కార్మికులు సుమారుగా 3కోట్ల మంది పనిదినాలును కోల్పోవడం జరిగింది. భవన నిర్మాణ రంగ కార్మికులను వెల్ఫేర్ బోర్డు నిధుల నుండి ఆదుకోవాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమం లో ప్రతిభవన నిర్మాణ కార్మికులు ప్లే కార్డులు పట్టుకొని ఎవరి అడ్డాల దగ్గర వారు నిరసన తెలియజేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెరుమళ్ళపల్లి మోహన్ రావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు దోనోజు లక్ష్మయ్య, జిల్లా సహాయ కార్యదర్శి మేడికొండ నాగేశ్వరరావు, సారంగి రమేష్, కృష్ణ, పావురాల నాగేశ్వారావు, మల్లెశెట్టి నరసింహారావు, బి. వెంకన్న, పాల్గొన్నారు.
కేంద్ర తీసుకువచ్చిన కార్మిక విధానాలకు వ్యతిరేకంగా నిరసన
మధిర : మధిర మార్కెట్ యార్డ్‌లో ఎమ్యల్ఎస్ పాయింట్ వద్ద సీఐటియు ఆధ్వర్యంలో హమాలీ వర్కర్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక చట్టాలు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ చట్టాల బిల్లుల ప్రతలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు తేలప్రోలు రాధాకృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి శీలం నరసింహారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నామాల శ్రీను, పడకంటి. మురళి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మందా సైదులు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్, ఎస్ఎఫ్ఎస్ఐ జిల్లా అధ్యక్షులు మధు ,డివైఎస్ఐ మండల కార్యదర్శి షేక్ సైదులు, ముఠా మేస్త్రి ప్రసాదు , గోపి, నాగరాజు, రాము, దుర్గయ్య, ఆర్డబ్ల్యూఎస్ నాయకులు నరసింహారావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్న మోడీ
సీపీఐ(ఎం) రైతు సంఘం డిమాండ్
ఎర్రుపాలెం : వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుపరం చేసి దేశాన్ని ఉన్నత వర్గాలకు తాకట్టు పెడుతుందని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల కమిటీ అధ్యక్షుడు గొల్లపూడి కోటేశ్వరరావు, ప్రభుత్వాలను విమర్శించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు పరచాలని డిమాండ్ చేస్తూ ఇంచార్జి డిప్యూటీ తహసీల్దార్ రాజేష్‌కు రైతులతో కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అయ్యవారిగూడెం సొసైటీ డైరెక్టర్ శ్రీ హరి నారాయణ, నాగులవంచ వెంకట్రామయ్య, కోటి సుబ్బారెడ్డి, బి వెంకటేశ్వర్లు, తాళ్లూరి వెంకటనారాయణ, శ్యామల రావు, ఆవుల వెంకటేశ్వర్లు, లక్ష్మారెడ్డి, షేక్ సుభాని, కోట వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల హక్కుల కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వం
సీటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మోహన్ రావు
ఖమ్మం రూరల్ : కేంద్రంలో మోడీ రెండోసారి అధికారం చేపట్టాక కార్మికుల చట్టాలను తుంగలో తొక్కి, కార్మికుల హక్కులను కాలరాస్తున్నడని సీఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెరుమళ్ళపల్లి మోహన్ రావు అన్నారు. సీఐటియు దేశవ్యాప్త పిలుపులో భాగంగా గురువారం మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద ప్రజా సంఘాల యూనియన్ నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దోనోజు లక్ష్మయ్య, ముదాం శ్రీనివాసరావు, సీఐటీయూ మండల కన్వీనర్ మేడికొండ నాగేశ్వరరావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష, కార్యదర్శులు దోనోజు పాప చారి, గూడ రామబ్రహ్మం, నాయకులు పెనుగొండ వీరయ్య, రవి, ఉపేందర్, హరికృష్ణ, రత్నాకర్, రవి, ఆశా వర్కర్లు సుజాత, మల్లేశ్వరి, జ్యోతి అంగన్వాడీ యూనియన్ నాయకులు భాగ్యమ్మ, సరిత, పుష్ప, లలిత, రాధ పాల్గొన్నారు.
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి
సీఐటీయు రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్
గాంధీచౌక్ : దేశ వ్యాప్తంగా కార్మిక సమస్యలు పరిష్కరించాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఐటీయు రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ డిమాండ్ చేశారు. సీఐటీయూ పిలుపులో బాగంగా త్రీ టౌన్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణు, సిఐటియు జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, భూక్య శ్రీనివాసరావు, పాశం సత్యనారాయణ, మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులు భాగంగా ఖమ్మం నగరం త్రీటౌన్ ప్రాంతంలో గ్రెయిన్ మార్కెట్, గాంధీ చౌక్ సెంటర్ లలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్, ఉపాధ్యక్షులు యర్రా శ్రీకాంత్ మాట్లాడుతూ దేశంలోని పలు ప్రాంతాల్లో మరలా విధించిన లాక్ డౌన్, కర్ఫ్యూలతో పల్లెలు, పట్టణాల్లో నిరుద్యోగం రేటు 14 శాతానికి చేరిందన్నారు. సమస్యలను పరిష్కరించడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు యర్రా శ్రీనివాస్, భూక్య శ్రీను, పాశం సత్యనారాయణ, మల్లారెడ్డి, పేరయ్య పాల్గొన్నారు.