Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
వేంసూరు మండలంలోని లచ్చన్నగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితులకు సత్తుపల్లి ఫుడ్ బ్యాంకు ఆధ్వర్యంలో ఆ గ్రామ సర్పంచ్ అర్చేపల్లి సుహాసిని చేతుల మీదుగా ఆహారం అందించారు. ఈ సందర్భంగా ఫుడ్ బ్యాంకు నిర్వాహకురాలు పఠాన్ ఆశాఖాన్ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ సుహాసిని, కరుణ ప్రసాద్ ద్వారా విషయం తెలుసుకుని మేమున్నామంటూ ముందుకు వచ్చి గత పది రోజులుగా ఫుడ్ బ్యాంకు ద్వారా రెండు పూటలా పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుందన్నారు. సర్పంచ్ సహకారంతో కొనసాగిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కార్యదర్శి వెంకట సుబ్బారావు, ఫుడ్ బ్యాంక్ సభ్యులు నాగమణి, విద్యాసాగర్, రాచర్ల చందు, సరోజ, రమేష్, రక్షణ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.