Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పది రోజుల వ్యవధిలో భార్యాభర్తల మృతి
- నివాళి అర్పించిన తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్లు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కోటి అమరయ్య(73) కరోనాతో పోరాడుతూ గురువారం ఉదయం మృతి చెందారు. కోటి అమరయ్య మృతదేహాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సందర్శించి మృతదేహంపై ఎర్ర జెండా కప్పి నివాళులర్పించారు.
పది రోజుల వ్యవధిలో కరోనాతో దంపతులు మృతి
అమరయ్య సతీమణి అచ్చమ్మ ఈనెల 1వ తేదీన కరోనాతో మృతి చెందారు. పది రోజుల వ్యవధిలోనే తల్లిని, తండ్రిని కోల్పోయిన అమరయ్య కుమారులు, కుమార్తె రోధిస్తున్న తీరు పలువురిని కంట తడి పెట్టించింది. వారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమరయ్య అంతిమయాత్ర నిర్వహించారు.
అమరయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించిన వారిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, మండల నాయకులు బత్తినేని వెంకటేశ్వరరావు, బందెల వెంకయ్య,పెరుమళ్ళపల్లి మోహన్ రావు, నందిగామ కృష్ణ, ఏటుకూరి ప్రసాద్ రావు, తమ్మినేని కోటేశ్వరరావు, సిద్దినేని కోటయ్య, యామిని ఉపేందర్, వరగాని మోహన్ రావు, గుర్రం మల్సూర్, కిరణ్, డాక్టర్ రంగారావు, పొన్నెకల్లు సర్పంచ్ తాటికొండ సుదర్శన్ రావు, ఐద్వా రాష్ట్ర నాయకురాళ్లు బుగ్గవీటి సరళ, బత్తుల హైమావతి, మాచర్ల భారతి, బండి పద్మ, మెరుగు రమణ, పొన్నెకల్లు, మద్దులపల్లి, తెల్దారు పల్లి, తల్లంపాడు గ్రామ శాఖ సభ్యులు, కత్రం ఉపేందర్ తదితరులు నివాళులర్పించారు. మృతునికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.