Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ దొడ్డా హైమవతిశంకరరావు
- చెక్ పోస్ట్ గస్తీ సిబ్బందికిమాస్కులు, శానిటైజర్లు, జ్యూస్ పంపిణీ
నవతెలంగాణ- సత్తుపల్లి
కరోనా కష్టకాలంలో లాక్ డౌన్ సేవలు అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని సత్తుపల్లి ఎంపీపీ దొడ్డా హైమవతి శంకరరావు అన్నారు. గురువారం సత్తు పల్లి మండలంలోని ఆంధ్రా సరిహద్దు ప్రాంతా లైన మేడిశెట్టివారి పాలెం, గురుభట్లగూడెం చెక్ పోస్ట్ ల వద్ద గస్తీ నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు, జ్యూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హైమవతిశంకరరావు మాట్లాడారు. పోలీసులు ప్రాణాలకు తెగించి సమాజం కోసం ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు. వీరి సేవలను సమాజం మరువలేనిదన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ ఎ.రమాకాంత్, సర్పంచ్ శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ కష్ణ, ఎంపీటీసీ సభ్యులు పిడుగు సత్యనారాయణ, ఎంపీడీవో చిట్యాల సుభాషిణి, సెక్రటరీ నిరోశ, నాయకులు దొడ్డా శంకరరావు, గాయం రాంబాబు, పాల్గొన్నారు.