Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేంసూరు
మండల పరిధిలోని కందుకూరు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసోలేషన్ కేంద్రానికి రోజువారీగా సహకరిస్తున్న దాతల సహకారం మరువలేనిదని ఉప సర్పంచ్ మందపాటి వెంకట్ రెడ్డి అన్నారు గురువారం అదే గ్రామానికి చెందిన బండి జగదీశ్ రెడ్డి ఐసోలేషన్ కేంద్రంలో ఉన్న అందరికీ పళ్ళు పోషకాహారాన్ని అందజేశారు. కందుకూరు గ్రామపంచాయతీ ఆంధ్రాసరిహద్దులో వుండటంతో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేసులను అరికట్టడానికి గ్రామ పంచాయతీ సిబ్బంది కృషి చేస్తున్నారు. కరోనా సోకిన వారిని వెంటనే ఐసోలేషన్ కేంద్రానికి తరలించి వారికి కావాల్సిన మందులు, ఆహారం వాటిని ఎప్పటికప్పుడు పంచాయతీ సిబ్బంది సమకూర్చటం రోజు పర్యవేక్షించడం జరుగుతుంది. వీటికి ఆర్థిక భారం గ్రామపంచాయతీ తో పాటు గ్రామస్తులు సహకరించటం పట్ల మండల అధికారులు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి, గొర్ల బుల్లిబాబు, పంచాయతీ కార్యదర్శి సజ్జ రాజగోపాల్, ఆశాలు, అంగన్వాడీ వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.