Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
కృష్ణా జిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామ శివారు బైక్ ప్రమాదవశాత్తు కందకంలోకి దూసుకెళ్లి వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా మధిర పట్టణం ఎస్సీ కాలనీకి చెందిన కొత్తపల్లి వెంకటేశ్వర్లు (57) బుధవారం అర్ధరాత్రి దాటాక తన పనులు ముగించుకొని నందిగామ నుండి మధిర వెళుతుండగా మాగల్లు గ్రామ శివారులో స్కూల్ సమీపంలో బైక్ అదుపుతప్పి కందకంలోకి దూసుకెళ్లడంతో వెంకటేశ్వర్లు అక్కడి కక్కడే మృతి చెందాడు. పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని నందిగామ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమొదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు.