Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా బాధితుల కోసం అండగా నిలబడదాం
- ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థులు
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రజా సేవే మా లక్ష్యంగా ముందుకు సాగుతూ, కరోనా బాధితుల కోసం అండగా నిలబడదామని ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థులు స్పష్టం చేశారు. గురువారం కరోనా టెస్టింగ్ కేంద్రాల వద్ద అల్పాహారాన్ని నిరంతరం అందజేస్తు మానవత్వాన్ని చాటుకున్నారు. ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల అధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని బూడిదగడ్డ హైస్కూల్, కరోనా టెస్టింగ్ కేంద్రాల వద్ద అల్పాహారాన్ని అందజేశారు. ఈ సంధర్బంగా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థులు భూక్యా రమేష్, సిద్దెల ఖాసిం, వాంకుడోత్ రవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థులు, హెల్ప్ లైన్ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, ఎంవి.అప్పారావు, జాటోత్ కృష్ణ, భూక్యా రమేష్, సందకూరి లక్ష్మి, నందిపాటి రమేశ్, తదితరులు పాల్గొన్నారు.