Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైఎస్ఆర్టీపీ జిల్లా అధ్యక్షులు కొల్లు వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ-మణుగూరు
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా షర్మిల పార్టీ ఏర్పాటు చేయడం జరుగుతుందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు కొల్లు వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం మణుగూరు పట్టణంలో పార్టీ ఆవిర్భావ సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో కరోనా వల్ల మృతిచెందిన నిరుపేద కుటుంబాలకు రూ.15వేల ఆర్ధికసాయం చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో మండల కమిటీలను ఏర్పాటు చేశారు. మణుగూరు మండల కమిటీ నాయకులు పసునూరి ఉప్పల్‌రెడ్డి, ఎస్కె. అహ్మద్ హుస్సేన్, బుర్ర సోమేష్ గౌడ్, ఎస్కె. నభి, టి.రాములు, ఉడుముల తిరుపతిరెడ్డి, రమేష్ రెడ్డిలను ఎంపిక చేశారు. కరకగూడెం కమిటీలో రామగాని సత్యగిరి వర ప్రసాద్, రామగాని సుదర్శన్‌లను ఎంపిక చేశారు, పినపాక మండల కమిటీలో బత్తుల బ్రహ్మరెడ్డి, కంది వెంకట్‌రెడ్డి, అశ్వాపురం మండల కమిటీలో వైవి.పురుషోత్తం, మారం రమేష్, సందీఫ్రెడ్డి, మచ్చ శ్రీనులను ఎంపిక చేయడం జరిగిందని, ఈ కమిటీ కేవలం పార్టీ ఆవిర్భవం వరకు మాత్రమే వుంటాయన్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకోవడంలో ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.