Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఔదార్యం చాటుకున్న 2007 పదో తరగతి పూర్వ విద్యార్ధులు
నవతెలంగాణ-ముదిగొండ
ఏదో ఒక రీతిలో మండలంలోని జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ 2007 పదో తరగతి పూర్వ విద్యార్ధులు తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. ఇటీవల తమ స్నేహితులు ఇద్దరు మరణించడంతో వారి కుటుంబానికి కన్న కొడుకుల్లా మేమున్నామంటూ ఆర్ధిక సాయాలు అందించారు. అదే విధంగా మరో స్నేహితుడు బంక వినరు కుమార్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలుసుకుని మళ్లీ వారి మంచి మనస్సును చాటుకున్నారు. తమ వంతుగా గురువారం రూ.5000 వినరుకు అందించారు. సాయం చేసిన వారిలో బి.వెంకటేష్ రూ.500, వై.మల్లిఖార్జున్ రూ.500, ప్రసాద్ రూ.500, నరేష్ రూ.500, టి.నరేష్ రూ.500, వెంకటేష్ చౌదరి రూ.500, షేక్.బాషా రూ.500, ఆర్ వీరబాబు రూ.300, వి.గోపినాధ్ రూ.300, హరీష్ రూ.300, బి.వినోద్ రూ.300, పి.మహేష్ రూ.200 సాయం చేసి మంచి మనస్సును చాటుకున్నారు. ఈ సందర్భంగా వినరు ప్రతి ఒక్క స్నేహితుడికి కృతజ్ఞతలు తెలిపాడు.