Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారిచే మంత్రి పువ్వాడ పంపిణీ
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారిచే గురు వారం శాంతినగర్ జూనియర్ కళాశాలలో రాష్ట్ర రవాణా శాఖా మాత్యులు పువ్వాడ అజరు కుమార్ 4000 మాస్క్‌లు, శానిటైజర్స్‌ను పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్, కలెక్టర్ కర్ణన్, చైర్మెన్ డాక్టర్ వెలిగేటి చంద్రమోహన్, అధ్యర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి పులిపాటి ప్రసాద్, రాష్ట్ర కమిటీ మెంబెర్ శ్రీ సాదినేని జనార్ధనరావు, కోశాధికారి గోవర్ధనరావుతో పర్యవేక్షించనైనది. ఈ కార్యక్రమమునకు వచ్చిన ప్రజలకు, వ్యాక్సినేషన్ సిబ్బందికి, వ్యాక్సినేషన్‌కు వచ్చిన సుమారు 500 మందికి వీటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ పూనుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, 24వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ కమర్తపు మురళి, గౌరవ సభ్యులు వెలిగేటి విజయలక్ష్మి, కాకర్ల మల్లికార్జునరావు, ముజీబ్, రాధాకృష్ణ, ఖమ్మం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పీఆర్ఓ గంట ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు