Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆళ్లపాడు, కలకోట సర్పంచులను అభినందించిన పీడీ శిరీష
నవతెలంగాణ-బోనకల్
మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామంలో గల పల్లె ప్రకృతి వనాన్ని, నర్సరీని జిల్లా అడిషనల్ డీఆర్డిఓ పిడి శిరీష, ఏపిడి శ్రీనివాసరావు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సరీలో మంచి పోషణ కలిగిన మొక్కలు ఉన్నాయన్నారు. సర్పంచ్ మర్రి తిరుపతిరావు పల్లె ప్రకృతి వనాన్ని, నర్సరీని నిర్వహిస్తున్న తీరు బాగుందన్నారు. వాటిని పెంచి పోషిస్తున్న వనసేవకురాలు పార్వతిని అభినందించారు. భవిష్యత్తు తరాలకు ఆనందయ్య తయారు చేసే మందులో కలిపే తిప్పతీగతో సహా నర్సరీలో పలు రకాలు మొక్కలను పెంచడం చూసి సర్పంచ్ని అభినందించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న కరోనా టెస్టులు కేంద్రాన్ని సందర్శించారు. 40 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా అందులో 4 పాజిటివ్ వచ్చింది. ఆమె వెంట సర్పంచ్ మర్రి తిరుపతిరావు, ఎంపీడీవో శ్రీదేవి, విజిఎస్ విసి సతీష్, టెక్నికల్ అస ిస్టెంట్ నాగేశ్వర్రావు, ఏఎన్ఎం తిరుపతమ్మ, ఆశా కార్యకర్తలు, కళావతి, రత్నకుమారి ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి రేణుక పాల్గొన్నారు.
పల్లె ప్రకృతి వనం చాలా సుందరంగా తీర్చి తీర్చిదిద్దారు
కలకోట గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన పల్లె ప్రకతి వనంను, నర్సరీని గురువారం జిల్లా అడిషనల్ డీఆర్డిఓ పిడి శిరీష, ఎపిడి శ్రీనివాస్ ఆకస్మికంగా సందర్శించారు. పల్లె ప్రకతి వనం చాలా ఆహ్లాదకరంగా ఉందని సర్పంచ్ యంగల జంగాల దయామణిని, పంచాయతీ కార్యదర్శి బుద్ధుల లక్ష్మిని అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనం చాలా సుందరంగా తీర్చి తీర్చిదిద్దారన్నారు. నర్సరీని పరిశీలించి పలు సూచనలు చేశారు. నర్సరీలో ప్రతి బ్యాగ్ కు లెక్క ఉంటుందని గత అనుభవాల ను దష్టిలో ఉంచుకొని స్థానికంగా దొరికే సీడ్ ను సేకరించి మొక్కలు పెంచుకొంటే సమయం ఆదా అవుతుందని అన్నారు. దీనివలన మొక్కలు ఎదుగుదల బాగావుంటుందని అన్నారు. జిల్లాలో అనేక గ్రామాలలో పల్లె పకృతి వనాలు కంటే బోనకల్ మండలంలో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ దామాలు చాలా బాగున్నాయన్నారు. ఆమె వెంట ఎంపీడీఓ గొట్టిపాటి శ్రీదేవి, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ సతీష్, టెక్నికల్ అసిస్టెంట్ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.