Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ముదిగొండ
కరోనా వైరస్ నిర్మూలనకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. మధిర నియోజకవర్గంలో 5 మండలాలలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుందన్నారు. కరోనా రోగులు ఐసోలేషన్ కేంద్రాలకు వచ్చి అప్రమత్తంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ సామినేని హరిప్రసాద్, తహసీల్దార్ తూమాటి శ్రీనివాస్, ఎస్సై తాండ్ర నరేష్, జడ్పీటీసీ పసుపులేటి దుర్గ, ఎంపీడీవో డి శ్రీనివాసరావు, ఎంపీఓ పి సూర్యనారాయణ, వైద్యాధికారులు హర్షిదాబేగం, రమేష్ బాబు, ఏవో ఎం రాధ, వైస్‌ఎంపీపీ మంకెన దామోదర్, ఎంపీటీసీ బలంతు జయమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మీగడ శ్రీనివాస్ యాదవ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ పోట్ల ప్రసాద్, నేలకొండపల్లి ఏఎంసి డైరెక్టర్ బంక మల్లయ్య, వెంకటాపురం గ్రామసర్పంచ్ కోటి అనంతరాములు తదితరులు పాల్గొన్నారు.