Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పని ప్రదేశాన్ని సందర్శించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
నవతెలంగాణ-రఘునాధపాలెం
కామంచి కళ్ళు గ్రామం చెరువులో పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికులను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, మండల అధ్యక్షులు, ప్రతాప లేని వెంకటేశ్వరరావు ఉపాధి పని ప్రదేశాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఉపాధి పని చేస్తున్న కార్మికులకు కనీసం మాస్కులు, శానిటైజర్లు ఇవ్వలేదని వారన్నారు. ఈ కరోనా నేపథ్యంలో పనిచేస్తున్న కార్మికులకు రోజు కూలీ వేతనం ఎంత వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని వారు తెలిపారు. అధికారులు మాత్రం ఉపాధి హామీ కార్మికులకు ప్రతి రోజు వేతనం చెల్లిస్తున్న మని అధికారులు చెప్పి తప్పించుకుంటన్నన్నారు. ఇప్పటికే గ్రామంలో 90 మందికి కరోనా పరీక్ష నిర్వహించగా 30 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ, అయిందని వారు తెలిపారు. 200 మంది చెరువులో పనిచేస్తున్న కార్మికులకు ఎటువంటి రక్షణ లేదని కరోనా వేగవంతం వ్యాప్తి చెందే అవకాశం ఉందని వారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులను తక్షణమే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి నాయకురాలు వెంకమ్మ, నాగమణి, గుండ్రా లక్ష్మి, కుమ్మరి, నాగమణి, జంగం లక్ష్మి, గుండ్ర రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.