Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
బనిగండ్లపాడు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు, కొత్తపాలెం, సఖునవీడు గ్రామాలలో కరోనా వ్యాధి లక్షణాలు కలిగియున్న 532 మందికి రాపిడ్ యాంటిజెన్ కిట్స్ ద్వారా జరిపిన పరీక్షలో 16 మందికి పాజిటివ్‌గా నిర్దారించబడినట్లు వైద్యాధికారి డాక్టర్ రాజు, వైద్యులు సుధాకర్ నాయక్, శశిపూర్ణ తెలిపారు. వైద్యాధికారి రాజు మాట్లాడుతూ పాజిటివ్‌గా గుర్తించిన వారిని గ్రామాలలోని ఐసోలేషన్ సెంటర్లకు తరలించామని, మండల వ్యాప్తంగా ఉన్న కరోనా వ్యాధిగ్రస్తులను గుర్తించి వ్యాధిని నియంత్రిచడానికి వివిధ గ్రామాలలో పెద్దమొత్తం లో టెస్టులను చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి రామకృష్ణ, మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ, కొత్తపాలెం గ్రామ సర్పంచ్ కత్తి నాగమణి, రేమిడిచర్ల ఎంపీటీసీ అప్పమ్మ, సఖునవీడు సర్పంచ్ యరమల విజయ భాస్కర్ రెడ్డి, వైస్ సర్పంచ్ చింతిరాల చిన దేవదానం, వైస్ ఎంపీపీ రామ కోటయ్య పాల్గొన్నారు.
కల్లూరు : కల్లూరు ఆసుపత్రిలో 20 కేసులు, చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 16 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యులు సత్య చెతన్య, శ్రావణ్ కుమార్, సురేష్‌లు తెలిపారు.