Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే, కలెక్టర్కు ఆదేశం
- ఎమ్మెల్యే, చైర్మెన్, పీఓ సందర్శన
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణంలోని 17వ వార్డుకు చెందిన బట్టు గణేష్ 3 యేండ్ల క్రితం క్యాన్సర్ వ్యాధితో మృతి చెందగా అతని భార్య బట్టు స్రవంతి ఇద్దరు చిన్నారులతో శ్రీరామ్ చిట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తోంది. విధి వైపరీత్యం 2 రోజుల క్రితం స్రవంతి కూడా కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధితో బాధపడుతున్న తరుణంలో కరోనా బారిన పడి మృతి చెందినది. ఆ ఇద్దరు చిన్నారుల ఆలనా పాలనా చూసే బాధ్యత వృద్ధురా లైన వారి అమ్మ మీదపై పడగా ఈ పరిస్థితిని చూ సిన మృతురాలి స్నేహితురాలు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు విన్న వించింది. దీంతో స్పందించిన మంత్రి కలెక్టర్, ఎమ్మెల్యే హరిప్రియకు చిన్నారుల సంరక్షణ బాధ్యత తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యే హరిప్రియ, మున్సిపల్ చైర్మెన్, వైస్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, జానీ, ఐటీడీఏ పీవో తదితరులు మృతురాలు స్రవంతి ఇంటికి వెళ్ళి అనాధ పిల్లలను అక్కున హత్తుకున్నారు. వారి అమ్మమ్మ తాత శ్రీదేవి సాంబయ్యలను ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ... తల్లిదండ్రులను కోల్పోయిన ఈ చిన్నారులకు ఒక డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఈ పిల్లల పేరునా ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా పిల్లల చదువు, ఐటీడీఏ తరఫున కొంత ఫిక్స్డ్ డిపాజిట్, చదువుల కోసం నెలకు ఆర్థిక సహాయం, సంరక్షణ బాధ్యతను తాను స్వీకరిస్తానని, భవిష్యత్తులో పిల్లలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి బాధ్యతతో పిల్లల సంరక్షణ బాధ్యత తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా పిల్లల పరిస్థితిని చూసి చలించి తక్షణమే వారికి సహాయం చేయాలని పెద్ద మనసుతో ముందుకు వచ్చిన కేటీఆర్కు ఎమ్మెల్యే హరిప్రియ కృతజ్ఞతలు తెలియజేశారు.