Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్షం వ్యక్తం చేసిన కలెక్టర్
నవతెలంగాణ-కొత్తగూడెం
కరోనా సోకడం వల్ల ప్రాణవాయువు తీసు కోవడానికి ఇబ్బంది పడుతున్న వారికి ఏఎస్‌డీఎస్ స్వచ్చంద సంస్థ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందచే యడం పట్ల కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్ నందు సంస్థ అధినేత గాంధీబాబు దాతల సహకారంతో సుమారు రూ.25 లక్షల విలువ గల 45 ఆక్సిజన్ కాన్సెనెటర్లు విరాళంగా ఇచ్చినట్టు చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ సోకి ఆక్సిజన్ తీసుకో వడానికి ఇబ్బంది పడుతున్న వారికి ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌తో సేవలందించేందుకు ఈ కాన్సెంట్రేటర్లు సంజీవినిలాగా ఉపయోగపడతాయన్నారు. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు విరాళంగా ఇచ్చినందుకు దాతలను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. దాతల సహాకారంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలు నిర్వహణకు అవకాశం ఏర్పడుతున్నదని చెప్పారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు తక్షణమే ఆక్సిజన్‌తో వైద్య సేవలు అందించడానికి చాలా ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ అశోక్ చక్రవర్తి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, సంస్థ కో-ఆర్డినేటర్ రాజుకుమార్ తదితరులు పాల్గొన్నారు.