Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసనలు
- అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలి
- ప్రంట్ లైన్ వర్కర్లలందరికీ రూ.50లక్షల ఇన్సూరెన్సు కల్పించాలి
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్
నవతెలంగాణ-భద్రాచలం
దేశప్రజల ప్రాణాలతో బీజేపీ మోదీ ప్రభుత్వం వ్యాపారం చేస్తుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్, జిల్లా ఉపాధ్యాక్షులు కె.బ్రహ్మాచారిలు విమర్శించారు. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని, ప్రయివేట్ హాస్పటల్స్‌కి వ్యాక్సిన్ ఇవ్వోద్దన్నారు. జాతీయ కమిటీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం భద్రాచలంలో పలుచోట్ల ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఉచితంగా వేయాల్సిన వ్యాక్సిన్‌కి 3 రకాల ధరలు నిర్ణయించి దానిపై జీఎస్టీ విధించి కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తుందని విమర్శించారు. కోవిడ్‌తో భాదపడుతున్న వారికి ఆక్సిజన్, వ్యాక్సిన్, మందులు అందించటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. దేశ ప్రజలు మరణిస్తుంటే మోదీ మాత్రం వ్యాక్సిన్, ఆక్సిజన్, మందులు విదేశాలకు ఎగుమతి చేయటం దేశద్రోహమైన చర్యగా పేర్కొన్నారు. ప్రతినెల రూ.7500 ప్రతి కుటుంబానికి నగదు బదిలి చేయాలని డిమాండ్ చేశారు. ఫ్రంట్ లైన్ కార్మికులందరికీ రూ.50 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని, లేబర్ కోడ్లు రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు యం.బి.నర్సారెడ్డి, నాయకులు గడ్డం స్వామి, బి.వెంకటరెడ్డి, కాపుల రవి, నాగరాజు, మాధవి సుభ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం : లాక్ డౌన్ నేపథ్యంలో కార్మికుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయని, ఆరోగ్యం కాపడుకోవడంలో, ఆర్ధికంగా ఆదుకోవడంలో కార్మికుల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎంవి.అప్పారావు అన్నారు. కొత్తగూడెం పట్టణ పరిధిలో ఉన్న అసంగటిత రంగ కార్మికుల కేంద్రాల వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అప్పారావు మాట్లడుతూ కనీస వేతనం అమలు చేయడంలో, ఉద్యోగ భద్రత కల్పించడంలో, ఆర్ధికంగా ఆదుకోవడంలో కార్మికుల పట్ల వివక్షచూపెట్టడం సరికాదన్నారు. కరోనా కాలంలో ప్రతి కార్మికుడికి నెలకి రూ.7,500లు ఇవ్వాలని, కేరళా తరహాలో నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలన్నారు. ఉచితంగా వాక్సిన్ వేయాలని డిమాండ్ చేశారు. హమాలీ, ఆశ వర్కర్స్, ఆటో, ఆర్టీసి, పెట్రోల్ బంక్ కార్మికుల, హాస్పటల్ వర్కర్స్, తదితర అసంఘటిత రంగాల వద్ద సమస్యలతో కూడిన ప్లకార్డులుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రింగు వెంకటయ్య, దుర్గమ్మ, జాకబ్, భూక్యా రమేష్, జునుమల నగేష్, డి.వీరన్న, లిక్కి బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.
ఐద్వా ఆధ్వర్యంలో
కరోనాను, బ్లాక్ ఫంగస్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంలోకి చేర్చి పేదలకు ఉచిత వైద్యం అందించాలని ఐద్వా పట్టణ కార్యదర్శి సందకూరి లక్ష్మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మున్సిపల్ పరిధిలోని పలువార్డుల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మధురబస్తీలో జరిగన కార్యక్రమంలో లక్ష్మీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నందిపాటి రజిత, సువర్ణ, రాజ్యలక్ష్మీ, సంధ్య, బాయమ్మ, అనసూయ తదితరులు పాల్గొన్నారు
డీవైఎఫ్ఐ, సీఐటీయూ ఆధ్వర్యంలో
మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సీఐటీయూ పట్టణ నాయకులు జూనుమాల నగేష్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లిక్కి బాలరాజు అన్నారు. గురువారం మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తు పట్టణంలో కార్మికులతో నిరసన తెలియచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ నాయకులు ఆవుల శ్రీరాములు, అనిల్, గంగ, హైమా, శివారెడ్డి శ్రీను, శివ, శారద, రాజేశ్వరి, అరుణమ్మ, దేవి, గంగ, నిరోష తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి మైన్స్ డిపార్ట్మెంట్లో
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా సింగరేణి మైన్స్, డిపార్ట్‌మెంట్‌ల్లో గురువారం కార్మికులు నిరసన తెలిపారు. అనంతరం సింగరేణి జీఎం పర్సనల్ అందెల ఆనందరావుకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమంలో, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని ఆయన తెలియజేశారు. ఈ కరోనా కష్టకాలంలో కార్మికులు వైరస్‌కు భయపడుతూ బొగ్గు ఉత్పత్తి చేస్తున్న పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ ప్రభుత్వ విధానాలు మార్చుకోకుంటే పెద్ద ఎత్తున కార్మికులు, ఉద్య మాలు చేస్తారన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు విజయగిరి శ్రీనివాస్, రాజారావు, వై.వెం కటేశ్వరరావు, వీరస్వామి, ఎలగొండ శ్రీరాంమూర్తి, ఎం.వెం కటేశ్వర్లు, కూరపాటి.సమ్మయ్య కార్మికులు పాల్గొన్నారు.