Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ మార్కెట్ లో రైతుల ఆందోళన
- అదనపు కలెక్టర్ మదుసుదనరావు హామీతో ఆందోళన విరమణ
నవతెలంగాణ-వైరాటౌన్
వైరా వ్యవసాయ మార్కెట్ గోదాములలో వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఉన్న రైతుల ధాన్యం బస్తాలు నిల్వ చేయాలని, ఇతర ప్రాంతాల నుంచి లారీలలో వచ్చిన ధాన్యం బస్తాలను దిగుమతి చేయకుండా శుక్రవారం రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘంజిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు మాట్లడుతూ వైరా వ్యవసాయ మార్కెటులో కాంటా వేసిన 17,000 ధాన్యం బస్తాలను తరలించకుండా, అధికారులు వైరా వ్యవసాయ మార్కెట్ గోదాములలో స్థానిక రైతుల ధాన్యం బస్తాలను నిల్వచేయకుండా ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం బస్తాలను తరలించటం సమంజసం కాదన్నారు. మొదట వైరా మార్కెట్టులో ఉన్న ధాన్యం బస్తాలను, వైరామండలంలోని గ్రామాలలో ఉన్న ధాన్యం బస్తాలను తరలించిన తరువాత ఇతరప్రాంతాల ధాన్యం దిగుమతి చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కాలక్టర్ మధుసూధన్ రావు, రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ తోమాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని కోరారు. మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్ర రాజశేఖర్, మార్కెట్ చైర్మన్ గుమ్మ రోశయ్య రైతుల ఆందోళన వద్దకు చేరుకొని రైతులు డిమాండ్ తెలుసుకుని ఆదనపు కలెక్టర్ మధుసూదనరావు, మార్కెట్ డీఎం నాగారాజు, డిఎస్ఓ రాజేందరుతో బొర్రా రాజశేఖర్, గుమ్మా రోశయ్య, బొంతు రాంబాబు ఫోన్ ద్వారా రైతుల సమస్యలు వివరించారు, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదనరావు ఖమ్మం రైస్ మిల్లులకు వైరా మండలంలోని ధాన్యం కొనుగోలు ఎలాట్ చేస్తామని, ధాన్యం బస్తాలను వ్యవసాయ మార్కెట్ గోదాములలో నిల్వ చేయడానికి అవకాశం ఉందని, వైరా వ్యవసాయ మార్కెట్ గోదాములలో 25వేల క్వింటాలు నిల్వ చేయటుకు అనుమతి ఇచ్చామని తెలిపారు. వైరా రైతుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని గోదాములలో నిల్వ చేయడానికి అనుమతి ఇచ్చామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(యం) పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్ ,రెబ్బవరం ఎంపీటీసీ రాయాల రమేష్, సైదులు, శ్రీధర్, రెడ్డి, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు