Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
బోనకల్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లో ఉన్న కరోనా బాధితులను ఖమ్మం జిల్లా దిశ కమిటీ సభ్యులు, మధిర కె వి ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కోట రాంబాబు శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఐసోలేషన్ సెంటర్లో ఉన్నవారంద రికీ, హౌమ్ ఐసోలేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి వారికి శాచురేషన్ లెవల్స్, బాడీ టెంపరేచర్ లెవల్స్ పరీక్షించి ఎవరూ అధైర్యపడవద్దు అందరూ ఆరోగ్యవంతంగా ఉన్నారని వారికి మనోధైర్యము కల్పించారు. అనంతరం వారందరికీ పండ్లు, మాస్కులు, శానిటైజర్ లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బోనకల్ గ్రామ సర్పంచ్ భూక్య సైదా నాయక్ , జెడ్పిటిసి మోదుగు సుదీర్ బాబు, పంచాయతీ కార్యదర్శి దామల్ల కిరణ్, యూత్ నాయకులు భూక్య పిచ్చేశ్వరనాయక్, యూత్ సభ్యులు సుదీర్, సూర్య, సైదులు, వెంకటేశ్వర్లు, రమేష్ , నాగరాజు, శ్రీను, ఆషా వర్కర్స్ పంచాయతీ సిబ్బంది మంద నాగరాజు అంతోటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.