Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్న దేవాలయాల సిబ్బందికి నిత్యావసర వస్తువులు పంపిణీ
నవతెలంగాణ-భద్రాచలం
కరోనా నేపథ్యంలో లాక్డౌన్ వల్ల చతికిలపడ్డ చిన్న కుటుంబాలకి ఆదుకోవడానికి ముందుకు వచ్చారు జేడీ ఫౌండేషన్ వారు. ఈ మహత్తర కార్యక్రమంలో తాము కూడా పాలుపంచుకుంటామని ముందుకు వచ్చారు ప్రవాస భారతీయులు డాక్టర్ విశ్వ నారాయణ (ఇంగ్లాండ్) ఇప్పటికే లాక్డౌన్ మొదలైన రోజు నుండి నిర్విరామంగా పగలు రాత్రి తేడా లేకుండా అన్నదానం, ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు సరఫరాతో పాటు పలుకరోనా వచ్చి ఐసోలాషన్లో ఉన్న కుటుంబాలకు నిత్యావసర వస్తువులు ఇస్తున్న సంగతి విధితమే. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న దేవాలయాలు సిబ్బందికి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ భాద్యుడు మురళీ మోహన్ కుమార్, హన్సి, కడాలి నాగరాజు, యూసుఫ్ మియా తదితరులు పాల్గొన్నారు.