Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
కరోనా కష్ట కాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్న పృద్వీ ఆర్మీ హెల్ప్‌లైన్ మండలంలో అమరజీవి యలమంచి సీతారామయ్య పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్టుకు రూ.5 వేల విరాళం అందజేశారు. శక్రవారం ములకపాడు యలమంచి సీతారామయ్య భవన్లో ట్రస్టు సభ్యులకు పౌండర్ బొల్లి పృద్విరాజ్ రూ.5 వేల నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పృద్వీ ఆర్మీ హెల్ప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కరోనా సోకిన కుటుంబాలకు అండగా ఉంటూ వారికి నిత్యవసరాలు అందజేయడంతో పాటు పెద్ద ఎత్తున శానిటైజర్లు, మాస్క్‌లు అందజేయడం జరిగిందన్నారు. వైఎస్ఆర్ ట్రస్టు సభ్యులు యలమంచి వంశీకృష్ణ మాట్లాడారు. సాయం అందిచిన పృద్వీ ఆర్మీ హెల్ప్ ఆర్గనైజేషన్ పౌండర్‌తో పాటు కన్వీనర్ కుమ్మరికుంట సాంబశిరావు సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ట్రస్టు, ఆర్మీ హెల్ప్ ఆర్గనైజేషన్ సభ్యులు యలమంచి శ్రీనుబాబు, వెంకటనర్సయ్య, మర్మం చంద్రయ్య, ప్రసాద్, బొల్లి రామకృష్ణ, ప్రవీణ్, ప్రభాకర్, ప్రతాప్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.