Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పోలీసు అధికారుల సమక్షంలో 8 మంది మావోయిస్టులు శుక్రవారం లొంగిపోయారు. ఒకరు ఆయుధంతో సహా లొంగిపోయారు. ఇందులో ఒకరిపై రూ.22 లక్షల రివార్డ్ ఉందని పోలీసులు వెల్లడించారు.
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పునరావాస పధకం పట్ల ఆకర్షితులై జనజీవన స్రవంతిలోకి వచ్చామని లొంగిన నక్సల్స్ తెలిపారు. పునరావాస పధకం కింద ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పునరావాసం, ఇతర పధకం కింద సహాయం అందించటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుక్మా జిల్లా కలెక్టర్ వినీత్ నందన్వర్, సీఆర్పీ ఎఫ్ డీఐజీ యోగ్యన్ సింగ్, ఎస్పీ కెఎల్ ధ్రువ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. యువత చెడు మార్గంలో నడవకూడదు మంచి మార్గంను ఎంచుకోవాలని అన్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి కలవాలన్నారు.