Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
జర్నలిస్టు రఘు అక్రమ ఆరెస్టును నిరసిస్తూ మణుగూరులో జర్నలిస్టులు నిరసన తెలియజేశారు. శుక్రవారం తహసీల్దార్ కె.చంద్రశేఖర్‌రెడ్డి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాచర్ల శ్రీనివాస్, చందు, ఉపేందర్, లింగ శ్రీనివాస్, శేఖర్, రమేష్, జ్యోతిబస్, రవీందర్, రాజ్‌కుమార్, బోడ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ : జర్నలిస్టు రఘుపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేసి అతన్ని విడిచిపెట్టాలని తీన్మార్ మల్లన్న టీం సభ్యులు తహసీల్దార్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు చేస్తున్న అక్రమాలు భూకబ్జాలపై తెలంగాణ ప్రజలను మేక్కోలిపే కథనాలు రాసినందుకే అతనిపై కక్షకట్టారని అన్నారు. అతనిపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తీన్మార్మల్లన్న టీం సభ్యులు అజ్మీరా నరేష్, అంగోత్ సురేష్, భట్టు వీరన్న, భానోత్ రాజేశ్, తేజావత్ దుర్గా ప్రసాద్, అజ్మీరా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.