Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొన్నది 16,057 క్వింటాలు
- తరలించింది12,171 క్వింటాలు కొనుగోలు కేంద్రాలలో నిల్వ 3,887 క్వింటాలు
నవతెలంగాణ- బోనకల్
రైతులు పంట ప్రారంభం నుంచి పంట అమ్ముకునే వరకు పడుతున్న కష్టాలు చూస్తే ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టక తప్పదు. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పగలనక రేయనక అప్పులు చేసే పంటలు పండించి చివరకు పంట అమ్ముకునే రోజు కూడా రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కజొన్న పంట సాగు చేయవద్దని ఒకవేళ సాగు చేసినా ప్రభుత్వం కొనుగోలు చేయదని స్పష్టం చేశారు. ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరు ప్రైవేటు వ్యాపారులను నమ్ముకొని మోసపోవద్దని పదేపదే ప్రకటనలు గుప్పించారు. ముఖ్యమంత్రే కాక టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కూడా గ్రామాలలో ఇదే జపం చేశారు. కానీ ఆచరణలో రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. బోనకల్ మండలం లో 9 సహకార సంఘాల పరిధిలో 13 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చవలసి ఉండగా కేవలం మూడు సహకార సంఘాల పరిధిలో నాలుగు కొనుగోలు కేంద్రా లను మాత్రమే ప్రారంభించారు. దీంతో రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కలకోట సహకార సంఘం పరిధిలో రాయన్న పేట గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రాయన్న పేట కొనుగోలు కేంద్రంలో 9,275 క్వింటాలను, బ్రాహ్మణపల్లి సహకార సంఘం పరిధిలో రాపల్లి ఉంది. బ్రాహ్మణపల్లి , రాపల్లి కొనుగోలు కేంద్రాలలో 4,982 క్వింటాలను, పెద్దబీరవల్లి సహకార సంఘం పరిధిలో పెద్దబీరవల్లి కొనుగోలు కేంద్రంలో 1,800 క్వింటాలను కొను గోలు చేశారు. ఈ నాలుగు కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తం 16,057 క్వింటాలను కొనుగోలు చేశారు. రైతుల అనేకసార్లు ఒత్తిడి మేరకు ఈ నాలుగు కేంద్రాల నుంచి 12,175 క్వింటాలను తరలించారు. ఇంకా ఈ నాలుగు కొనుగోలు కేంద్రాలలో 3,887 క్వింటాలు నిల్వ ఉన్నాయి. బ్రాహ్మణపల్లి , రాయన్న పేట కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తోంది. కానీ అధికారులు మాత్రం లారీల కొరత పేరుతో, బస్తాకు అదనంగా పది రూపాయలు ఇవ్వలేదని కారణంతో కొనుగోలు కేంద్రం లోని ధాన్యపు బస్తాలను నిల్వ ఉంచారు. పెద్ద బీరవల్లి కొనుగోలు కేంద్రంలో మాత్రం ధాన్యాన్ని కొనుగోలు చేసి దగ్గర దగ్గర నెల రోజులు అవుతుంది. ధాన్యాన్ని అమ్ముకొన్నామని తమ కష్టం తీరిందని అనుకున్న అన్నదాతలకు రోజురోజుకి కష్టాలు ఎదురవు తున్నాయి. నాలుగు రోజులుగా వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యపు బస్తాలను తరలించే వరకు రైతులదే బాధ్యతని అధికారులు షరతు విధించడంతో ధాన్యం బస్తాలు తడవకుండా అన్నదాతలు అనేక జాగ్రత్తలు తీసుకుంటూ, వర్షం వచ్చిన సమయంలో పూర్తిగా అక్కడే పగలు రాత్రి పడిగాపులు కాస్తున్నారు. ఈ కష్టాలు భరించలేకనే గోవిందపురం ఏ అన్నదా తలు పోరాటాలతో సమస్యను పరిష్కరిం చుకొన్నారు. మరి ఈ కొనుగోలు కేంద్రాల పరిధిలో గల రైతులు మమ్మగా మయగా అంటూ అధికారులను వేడుకుంటూ ప్రతిరోజు కష్టాలను ఎదుర్కొంటారా లేక పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని పోరాటం చేసి కష్టాలనుంచి బయట పడతారా వేచి చూద్దాం.