Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ పాలనలో ప్రజలపై పెనుభారాలు
- సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ- ఖమ్మం
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై పెనుభారాలు మోపోతోందని సీఎల్పీ లీడర్, మధిర ఎంఎల్ఏ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ఎఐసిసి, పిసిసి పిలుపులో భాగంగా శుక్రవారం జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో ఖమ్మంనగరంలోని పెట్రోల్ బంక్ల వద్ద నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే పేదలపై మోయలేని భారం వేయడం దుర్మార్గమన్నారు. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలను కూడా అమాంతం పెంచేశారన్నారు. ధరలను నియంత్రించలేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతా రన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, మాజీ ఎంఎల్సి పోట్ల నాగేశ్వరరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావిద్, కార్పొరేటర్లు దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మళీదు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు నాయక్, బద్దం నిరంజన్ కుమార్, మహ్మద్ రఫీ బేగం, మాజీ కార్పొరేటర్లు వడ్డెబోయిన నర్సింహారావు, యర్రం బాలగంగాధర్ తిలక్ తదితరులు పాల్గొన్నారు.