Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలిస్తే 7901144600 నెంబర్కు సమాచారం ఇవ్వండి
- పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్
నవతెలంగాణ- ఖమ్మం
జిల్లాలో ఎవరైనా నకిలీ విత్తనాలు, అనధికారిక విత్తనాలు అమ్మినా ఉపేక్షించేది లేదని, సంబంధిత డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. జిల్లాలో నకిలీ విత్తనాలను పూర్తిస్థాయిలో రూపుమాపడంపై తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ కమిషనర్ పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గత ఐదేండ్లుగా విత్తనాలు కొనుగోలు చేసి వేసిన పంటకు దిగుబడి రాక నష్టపోయిన రైతులు అదేవిధంగా నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులు జిల్లాలో ఎవరైనా వున్న అలాగే ప్రస్తుత పరిస్థితులలో జరుపుతున్న నకిలీ మోసాలపై పోలీస్ వాట్సాప్ నెంబర్ 7901144600 సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. నకిలీ విత్తనాలను నిరోధించడానికి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా, మండల స్థాయిలో టాస్క్ఫోర్స్ టీమ్లను ప్రత్యేకంగా నియమించామన్నారు.