Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ యుటీఎఫ్ జిల్లా కోశాధికారి రాంబాబు
నవతెలంగాణ-బోనకల్
ఐదేళ్ల పీఆర్సి మూడేళ్ల తర్వాత ఉద్యోగులు అందుకుంటున్నారని టీఎస్ యుటీఎఫ్ జిల్లా కోశాధికారి వల్లం కొండా రాంబాబు అన్నారు. మండల కేంద్రంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐక్య పోరాటాల ఫలితంగానే ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. ఆలస్యంగానైనా అమలు చేస్తున్నందుకు ఉద్యోగస్తులకు కొంత సంతోషంగా ఉందన్నారు. పన్నెండు నెలల బకాయిలు రిటైర్మెంట్ సందర్భంలో ఇస్తామనటం సరైన పద్ధతి కాదన్నారు. ఇంటి అద్దె అలవెన్స్ రేట్లలో కోత అన్యాయమని, డిఎ 50శాతం మించిన సందర్భంలో హెచ్ఆర్ఏ రేట్లు స్వల్పంగా పెంపు ఉపశమనం కలిగిస్తోందన్నారు.
గ్రామీణ ప్రాంత ఉద్యోగులకు ప్రోత్సాహకంగా రూరల్ ఏరియా అలవెన్స్ ఇస్తామన్న ప్రభుత్వం మాట నిలుపుకోలేదు అన్నారు. పైగా ఇంటి అద్దె అలవెన్స్ రేటు తగ్గించి ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిందన్నారు.ఏజన్సీ ప్రాంతం ఉద్యోగులకు అదనపు ఇంటి అద్దె భత్యం ఏ హెచ్ ఆర్ ఏ స్పెషల్ కాంపెన్జేటరీ ఎస్ సి ఏ జిఓలు ఇవ్వకపోతే వారు నూతన వేతనాలు పొంద లేరన్నారు. అందువలన వెంటనే ఆ జిఓలను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ చెల్లింపు, వైద్య ఖర్చులు 350 నుండి 600కు పెంపు హర్షణీయమన్నారు. గ్రాట్యుటీ, పెన్షన్ బకాయిలు 36 వాయిదాల్లో చెల్లించాలనటం అన్యాయమన్నారు. విలేకర్ల సమావేశంలో లో టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు కంభం రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకష్ణ, ఉపాధ్యక్షుడు ఎంసి ఆర్ చంద్ర ప్రసాద్ , ఉపాధ్యక్షురాలు పి.సుశీల, కోశాధికారి ఏ పుల్లారావు కార్యదర్శులు పిగోపాల్ రావు , బి ప్రీతం, కె.అనిల్ కుమార్, ఎస్ శ్రీనివాసరావు, కే శ్రీనివాసరావు సౌభాగ్యలక్ష్మి , పీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.