Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
- బేతేలు కాస్పోయిల్ ఆధ్వర్యంలో
పాస్టర్లకు నిత్యావసరాలు అందజేత
నవతెలంగాణ-సత్తుపల్లి
కరోనా కట్టడి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్లో పేద వర్గాలకు దాతలు అందిస్తున్న చేయూత అభినందనీయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం సత్తుపల్లి మున్సిపల్ పరిధి ఎన్టీఆర్ నగర్ క్రీస్తు సంఘ భవన్ లో బేతేలు కాస్పోయిల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సండ్ర మండలంలోని 50 మంది పేద పాస్టర్లకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వీటితో పాటు రెండు సైకిళ్లను ఇద్దరు పాస్టర్లకు అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. కరోనా కష్ట సమయంలో పాస్టర్లును ఆదుకోవడానికి ముందుకు వచ్చిన బేతేలు కాస్పోయిల్ సొసైటీ వారిని అభినందించారు. సత్తుపల్లి లో కరోనా 3 వేవ్ ను ఎదుర్కొనే విధంగా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపుడి మహేశ్, కౌన్సిలర్లు అద్దంకి అనిల్, షేక్ చాంద్ పాషా, మండల పార్టీ నాయకులు దొడ్డా శంకరరావు, ఎన్సీసీ బాధ్యులు అలవాల కరుణాకర్ పాల్గొన్నారు.
వికలాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
తల్లాడ : వికలాంగులకు తల్లాడ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.