Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య
నవతెలంగాణ-ఎర్రుపాలెం
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా మండల అభివృద్ధిలో అచ్చు గుద్దినట్లు కనపడుతుందని పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణమని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య విమర్శించారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం రామిశెట్టి పుల్లయ్య భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో వీరయ్య మాట్లాడుతూ మధిర నియోజకవర్గ శాసనసభ్యులుగా బోడేపూడి వెంకటేశ్వరరావు ఉన్న కాలంలో ఎర్రుపాలెం మండల పరిధిలోని వివిధ గ్రామాలు అభివృద్ధి పథంలో ఉన్నాయని అన్నారు. విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలలో వెలుగులు నింపింది, రహదారులు లేని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తూ బస్సులు నడపడానికి చర్యలు తీసుకున్నారని అన్నారు. రైతుల పంటలు ఎండిపోతున్న దశలో నాగార్జున సాగర్ కాలువల వెంట తిరిగి నీటి సౌకర్యం కల్పించారని, రైతుల పక్షాన అసెంబ్లీలో పోరాడారని కొనియాడారు. ఆయన వారసుడిగా కట్టా వెంకట నరసయ్య శాసనసభ్యుడి అభివృద్ధికి బాటలే వేశారని అన్నారు. ఆయన తప్ప మిగిలిన ఏ ఎమ్మెల్యే మండల అభివృద్ధికి కృషి చేయలేదని విమర్శించారు. ఎర్రుపాలెంకు రైల్వే అండర్ బ్రిడ్జి లేకపోవడంతో వాహనాల దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బనిగండ్లపాడు గ్రామంలో పేరుకి 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉన్న అరకొర వసతులతో కొట్టుమిట్టాడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సగుర్తి సంజీవరావు, ఆంగోతు వెంకటేశ్వర్లు, నాగులవంచ వెంకట్రామయ్య, కోటి సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.