Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
ఏరియాలోని ఉద్యోగులకు వ్యాక్సినేషన్ వేగవంతం చేసేందుకు గనులు, విభాగాల అధిపతులతో శనివారం జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వ్యాక్సినేషన్ సద్వినియోగం చేసుకోవాలని ఏరియా జీఎం మల్లెల సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి ఉద్యోగులకు రక్షణ కల్పించే దిశగా సంస్థ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారని, సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ రెండువారాల్లోగా వ్యాక్సినేషన్ పూర్తి చేయడం కోసం సింగరేణి వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టాలని జీఎంలకు ఆదేశాలు జారీ చేసారన్నారు. ఉద్యోగులకు సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో, కోయగూడెం ఓసీ ఉద్యోగులకు టేకులపల్లిలో సింగరేణి కాలనీలోని సీఈఆర్‌క్లబ్‌లో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. నేడు ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు వ్యాక్సినేషన్ కేంద్రాలు పనిచేస్తాయన్నారు. కావున ఉద్యోగులందరూ తమకు కేటాయించిన కేంద్రాలలో కోవిడ్ వ్యాక్సిన్ ఇంతవరకు తీసుకోనివారు మొదటి డోసు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏరియా రక్షణ అధికారి పంజాల శ్రీనివాసు, ఏజీఎం జి.ప్రభాకరరావు, జేకేఓసీ ప్రాజెక్ట్ అధికారి బొల్లం వెంకటేశ్వర్లు, కోయగూడెం ప్రాజెక్ట్ అధికారి మల్లయ్య, డీజీఎం పర్సనల్ జి.వి.మోహన్ రావు, సెక్యురిటీ అధికారి వి.అంజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : నేడు మణుగూరు ఏరియా నిర్వహించే సింగరేణి కార్మికులు మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశామని జీఎం జక్కం.రమేష్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పివీకాలనీ సిఈఆర్ క్లబ్ మణుగూరు ఏరియా ఆసుపత్రిలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వ్యాక్సినేషన్ నిర్వహిస్తామన్నారు. ఉద్యోగుల పేరు నమోదు పద్దతిని వ్యాక్సిన్ అనంతరం విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు పరిశీలించారు. సీఈఆర్ క్లబ్ భద్రాద్రి స్టేడియం నందు రెండు సెంటర్లు, ఏరియా ఆసుపత్రి నందు రెండు సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు లలిత్‌కుమార్, ప్రిడ్జ్రాల్డ్, వెంకటేశ్వర్లు, డీవైసీఎంఓ మేరికుమారి, డాక్టరు సురేష్, ఎండి షబీరుద్దిన్, రాజేశ్వరరావు, తదితరులు పాల్గోన్నారు.