Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
మండల వ్యవసాయ శాఖ పరిధిలో గల గ్రామాలను ఆరు క్లస్టర్లుగా విభజించారు. ఆరు కస్టమర్లకు గాను ఆరుగురిని మండల విస్తరణ అధికారులను నియమించారు. ఆరు క్లస్టర్లలో రైతు వేదికలను నిర్మించారు. బోనకల్ క్లస్టర్లో బోనకల్, ఆళ్లపాడు, గోవిందాపురంఏ గ్రామాలు ఉన్నాయి. స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో రైతు వేదికను నిర్మించారు. బోనకల్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిగా ఎర్రగుంట సాధన విధులు నిర్వహిస్తున్నారు. రావినూతల క్లస్టర్ పరిధిలో రావినూతల, పెద్ద బీరవల్లి గ్రామాలు ఉన్నాయి. రావినూతల గ్రామంలో రైతు వేదికను నిర్మించారు. ఈ క్లస్టర్‌కు మురికిపూడి తేజ వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ముష్టి కుంట క్లస్టర్ పరిధిలో ముష్టికుంట్ల, చిరునోముల, చొప్పకట్లపాలెం గ్రామాలు ఉన్నాయి. ముష్టికుంట్లలో రైతు వేదిక నిర్మించారు. వ్యవసాయ విస్తరణ అధికారి గా దారగాని కళ్యాణి విధులు నిర్వహిస్తున్నారు. చిన్న బీరవల్లి క్లస్టర్ పరిధిలో చిన్న బీరవల్లి, నారాయణపురం, రాపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలు ఉన్నాయి. చిన్నబీరవల్లి గ్రామంలో రైతు వేదికను నిర్మించారు. వ్యవసాయ శాఖ విస్తరణ అధికారిగా గూగులోతు గోపి విధులు నిర్వహిస్తున్నారు. లక్ష్మీపురం క్లస్టర్ పరిధిలో లక్ష్మీపురం, రామాపురం, తూటికుంట్ల, గోవిందాపురం ఎల్, గార్లపాడు గ్రామాలు ఉన్నాయి. గోవిందా పురం ఎల్ గ్రామంలో రైతు వేదికను నిర్మించారు. వ్యవసాయ విస్తరణ అధికారిగా బండి శ్రీకాంత్ విధులు నిర్వహిస్తున్నారు. కలకోట క్లస్టర్ పరిధిలో కలకోట, రాయనపేట, మోటమర్రి, కలకోట గ్రామాలు ఉన్నాయి. వ్యవసాయ విస్తరణ అధికారిగా నాగినేని నాగ సాయి విధులు నిర్వహిస్తున్నారు. రైతులలకు ఏమైనా సమస్యలు ఉంటే వారిని కలవాలని కోరారు.
మండల వ్యవసాయ శాఖ అధికారి తో పని ఉన్నవారు మండల కేంద్రంలో గల రైతు వేదిక వద్దకు రావాలని కోరారు. పాత మండల వ్యవసాయ శాఖ కార్యాలయం నుంచి వ్యవసాయ శాఖ కార్యక్రమాలను మండల కేంద్రంలో గల రైతు వేదికకు మార్చినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్బూరి శరత్ బాబు తెలిపారు. మండల వ్యవసాయ శాఖ కార్యక్రమాలన్నీ ఈ రైతు నివేదిక నుంచే నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు ఈ మార్పుని మండల రైతు గమనించాలని ఆయన కోరారు.