Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన 12 వాహనాలను ఎస్ఐ బి కొండల్ రావు ఆదివారం సాయంత్రం సీజ్ చేశారు. మండల కేంద్రంలోని బోనకల్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఎస్ఐ కొండల్ రావు ఆధ్వర్యంలో పోలీసు నిఘా పెట్టారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఎటువంటి అనుమతి లేని 9 ద్విచక్ర వాహనాలను రెండు ఆటోలను ఒక ఇన్నోవా కారును ఎస్ఐ సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ లాక్ డౌన్ నిబంధనాలు ఉల్లంఘించి రోడ్ల పైకి వచ్చే వాహనాలను సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ అద్దంకి ఆనంద్ కుమార్ కానిస్టేబుళ్లు ఎన్ వెంకట్రావు ,ఎం. శివ కృష్ణ, వి శేఖర్, ఈ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
లాక్ డౌన్ ఉల్లంఘన 61 మందిపై కేసులు
కల్లూరు : కల్లూరులో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 61 మందిపై ఆదివారం కేసులు పెట్టి రూ.31, 600 జరిమానా విధించి, 7 ద్విచక్ర వాహనాలు, ఒక కారు సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రఫీ తెలిపారు.