Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాపారస్తులు, ,ప్రజలు సహకరిస్తున్నారు
- మున్సిపల్ కమిషనర్ నాగప్రససాద్
నవతెలంగాణ-మణుగూరు
మున్సిపాలీటీ పరిధిలోని అంబేద్కర్ సెంటరు నుండి సీఎస్పీ వరకు డ్రైనేజ్లను శుభ్రపరిచే ప్రక్రియ శరవేగం గా జరుగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ నాగప్రసాద్ తెలిపారు. ఆదివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేండ్లుగా ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న డ్రైనేజ్‌లు షిల్ట్ పేరుకుపోవడం కారణంగా ప్రతి సంవత్సరం మణుగూరు వరద ముంపుకు గురవుతుందన్నారు. అందులో భాగంగానే రోడ్డుకు ఇరువైపుల ఉన్నటువంటి షిల్ట్ తొలగిస్తున్నమన్నారు. కొందరు వ్యాపారస్థులు డ్రైనేజ్లపై నిర్మాణాలు చాలా కాలం క్రితం నుండి నిర్మించుకోని ఉన్నరన్నారు. డ్రైనేజ్లపై నిర్మించిన అక్రమ భవనాలను తొలగిం చేందుకు మొదట ఆటంకాలు ఏర్పడిన ప్పుడు ఇప్పుడు సహాకరిస్తు న్నరన్నారు. సుమారు రూ.20 లక్షలతో ప్రధాన రహాదారికి ఇరువైపుల ఉన్న డ్రైనేజీ వరద ప్రవహించే దిశగాఎలాంటి ఆటం కాలు లేకుండా ఆధునీకరిస్తున్నమన్నారు. మున్సీపాలీటీ సుంద రీకరణలో భాగంగా అంబేద్కర్ సర్కిల్ ఒకటి, తెలంగాణ చౌరస్తాలోట్రాఫిక్ అంతరాయం కలుగకు ండా నిర్మాణాలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఆఫిసర్ ఇటికాల భాస్కర్ పాల్గొన్నారు.