Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీఆర్ ట్రస్ట్‌కు కూరగాయలు, బియ్యం వితరణ
నవతెలంగాణ-భద్రాచలం
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బండారు చందర్రావు ట్రస్టు నిర్వహిస్తున్న కరోనా ఐసోలేషన్ సెంటర్ నిర్వహిస్తున్న తీరు చాల బాగుందని, రోగులకు అవసరైన పౌష్టిక ఆహారం అందించటంతో పాటు మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారని పట్టణ ప్రముఖ వస్త్ర వ్యాపారులు, బాలదుర్గా మల్లేశ్వర క్లాత్ స్టోర్స్ యజమాని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఐసోలేషన్ సెంటర్ ఎన్నిరోజులు నిర్వహిస్తే అన్ని రోజులు కూరగాయలు, ఆకు కూరలు అందజేస్తామని ఆదివారం వారు ప్రకటించారు. ఐసోలేషన్ సెంటర్‌ను పరిశీలన చేసిన ప్రముఖ వ్యాపారి, బచ్చు శ్రీనివాస్ సెంటర్ నిర్వహాణకు ఒక క్వింటా రైస్ అందింస్తామని ప్రకటించారు. భద్రాచలం పట్టణం, చుట్టు పక్కల గ్రామాల కరోనా పేషంట్లు బీసీఆర్ ట్రస్టు ఐసోలేషన్ సెంటర్‌ను ఉపయోగించుకోవాలని కోరారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజె.రమేష్ కోరారు. ట్రస్టుకు అండగా నిలుస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డంస్వామి, జిల్లా కమిటీ సభ్యులు కె.బ్రహ్మాచారి, యం.రేణుక, యం.బీ.నర్సారెడ్డి, నాయకులు బండారు శరత్ బాబు, బి.వెంకట రెడ్డి, యన్.నాగరాజు, సున్నం.గంగా తదితరులు పాల్గొన్నారు.