Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల, చర్ల నందు 2021-2022 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లు ప్రారంభ మైనవని చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బండి సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల కారణంగా వారి ఇంటి వద్ద నుండే ఆన్ లైన్ ద్వారా ప్రవేశం పొందవచ్చునను తెలిపారు. కళాశాలలో జనరల్ విభాగంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ కోర్సులు కలవని, అదేవిధంగా ఒకేషనల్ విభాగము నందు ఓఏఎస్, ఈటీ, ఎంటీ, టీఅండ్హెచ్ఎం, ఎంఎల్టీ, ఎమ్పీహెచ్డబ్ల్యు కోర్సులు కలవని తెలిపారు. ఈ కోర్సులలో చేరబోయే విద్యార్థులు షషష.్రbఱవ.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్ ద్వారా అడ్మిషన్ని పొందవచ్చని కోరారు.
ఎంతో అనుభవం ఉన్న ఉత్తమమైన అధ్యాపకులచే విధ్యా బోధన, అనువైన తరగతి గదులు, ల్యాబ్ సౌక ర్యం, కంప్యూ టర్ ల్యాబ్లు, సురక్షితమైన తాగు నీరు (ఆర్ఓ ప్లాంట్) సౌకర్యం, ఆహ్లాదకరమైన వాతావరణం, అన్ని విధాలైన సౌకర్యాలు ప్రభు త్వ జూనియర్ కళాశాల నందు కలవని, గత 10 యేండ్లుగా ఉత్తమమైన ఫలితాలను సాధిస్తూ గత సంవత్సరం అనగా మార్చి 2020 ఫలి తాల లో ప్రభుత్వ జూనియర్ కళాశాల పరంగా రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానంలో నిలిచి జిల్లాకే గర్వ కారణంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల, చర్ల నిలిచినదని తెలిపారు. ఉజ్వల భవిష్యత్తును తీ ర్చి దిద్దు కోవాల్సిందిగా విద్యార్థులను, విద్యార్థుల తల్లిదం డ్రులను కళాశాల ప్రిన్సిపాల్ విజ్ఞప్తి చేశారు. వివరాలకు 91 77970369, 8099529699, 9397316143, 9951193584 నంబర్లను సంప్రదించాల్సినదిగా ఆయన కోరారు.