Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణిలో కోవిడ్ వ్యాధిని సమూలంగా నివారించడానికి, సింగరేణి ఉద్యోగుల ప్రాణాలను కాపాడుటకు సంస్థ సింగరేణి వ్యాప్తంగా సంస్థలో పనిచేసే ఉద్యోగులందరికీ తప్పనిసరిగా కోవిడ్-19, వ్యాక్సిన్ వేయించాలనే ఉద్దేశ్యంతో మెగా వ్యాక్షినేషన్ కార్యక్రమాన్ని అన్ని ఏరియాలో ఏర్పాటు చేసినట్టు జీఎం పర్సనల్ అందెల ఆనంద రావు తెలిపారు. ఆదివారం సింగరేణి వ్యాప్తంగా కార్మికులకు వేసిన టీకావివరాలు వెల్లండించారు. సింగరేణి వ్యాప్తంగా తొలి రోజు 7500 మందికి టీకా వేశారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ డైరెక్టర్లు 'పా' అండ్ ఫైనాన్స్, డైరెక్టర్ ఎన్. బలరాం, డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్, డైరెక్టర్ సత్యానారాయణ రావు కంపెనీ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 39 సెంటర్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సంబందిత సమాచారాన్ని సింగరేణి చైర్మెన్ ఎన్.శ్రీధర్‌కు అందజేసినట్టు తెలిపారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటలవరకు జరిగిన కంపెనీ వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగిందని, కార్మికుల నుండి మంచి స్పందన కనిపించిందని తెలిపారు. వాక్సిన్ వేసిన వివరాలు వెల్లడించారు. కొత్తగూడెం హెడ్డాఫీస్ కార్పోరేట్లో- 258, కొత్తగూడెం ఏరియా- 500, ఇల్లెందు-150, మణుగూరు- 707, భూపాలపల్లి-748, రామగుండం-1ఏరియా-645, రామగుండం-2 ఏరియా-613, రామగుండం 3 ఏరియా-283 , శ్రీరామ్ పూర్ -1195, మందమర్రి -750, బెల్లంపల్లి -438, ఎస్టిపిపిలో- 40 మందికి వ్యాక్సిన్ వేశారు. కార్పోరేట్ పరిధిలోని హెడ్డాఫీస్, మెయిన్ హాస్పిటల్, కెసిఓఏ క్లబ్ నందు ప్రత్యేకంగా మెగా వ్యాక్సినేషన్ సెంటర్లను ఉద్యోగులందరికీ అందుబాటులో ఉండేలా మూడు సెంటర్లను ఏర్పాటుచేసి వ్యాక్సిన్ వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జీఎంలు అందెల ఆనంద రావు, కె.బసవయ్య, ఏరియాలో సిహెచ్. నర్సింహారావు, సింగరేణి వైద్యులు డాక్టర్ మంతా శ్రీనివాస్‌లు సంయుక్తంగా పర్యవేక్షించారు.
ఇల్లందు : సింగరేణి వ్యాప్తంగా ఉద్యోగులకు వ్యాక్సినేషన్ వేగవంతం చేసేందుకు గనులు, విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆదివారం ఇల్లందు ఏరియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఏరియా జీఎం మల్లెల సుబ్బారావు ఆదివారం ప్రారం భించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడారు. ఇల్లందు ఏరియా సీఈఆర్‌క్లబ్ జెకె ఏరియాలో, సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసామాని, అలాగే కొత్తగూడెం ఏరియాలో పనిచేస్తు ఇల్లందు ఏరియాలో నివసిస్తున్న ఉద్యోగులకు సెలవు కారణంగా ఇక్కడే వ్యాక్సినేషన్ ఏర్పాటుచేసా మన్నారు. ఈ సమావేశంలో ఎస్వోటు జీఎం వెంకటయ్య, జేకేఓసీ ప్రాజెక్ట్ అధికారి బొల్లం వెంకటేశ్వర్లు, డీజీఎం పర్సనల్ జి.వి.మోహన్ రావు, డాక్టర్లు ఎన్.నేరేళ్ళు, రాజశేఖర్, మల్లారెడ్డి, విజయరాజు, తదితరులు పాల్గొన్నారు.
టేకులపల్లి : సింగరేణి వ్యాపత్తంగా ఉద్యోగులకు వ్యాక్సినేషన్ వేగవంతం చేసేందుకు కోయగూడెం ఓసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు టేకులపల్లిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఏరియా రక్షణ అధికారి పంజాల శ్రీనివాసు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కోయగూడెం ఉద్యోగులకు సింగరేణి కాలనీ సీఈఆర్ క్లబ్ టేకుల పల్లిలో వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కేఓసీ ప్రాజెక్ట్ అధికారి మల్లారపు మల్లయ్య, డాక్టర్ జగన్ మోహన్ రావు, పర్సనల్ అధికారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి నిర్వహిస్తున్న మెగా వ్యాక్సినేషన్ వేయడంలో మణుగూరు ఏరియా ప్రథమ స్థానంలో నిలపాలని జనరల్ మేనేజర్ సీపీపీ కె.నాగభూషణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక సీఈఆర్ క్లబ్నందు భారీ వ్యాక్సికేషన్ సెంటర్‌ను ఆయన పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు లలిత్‌కుమార్, లకీëపతిగౌడ్, ఫ్రీజ్రాల్డ్, వెంకటేశ్వర్లు , మేరికుమారి,వి. ప్రభాకర్‌రావు, కోట శ్రీనివాస్, డాక్టర్ శేషగిరి, డాక్టర్. సురేష్, ఎస్వీ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.