Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంత్యక్రియలు నిర్వహించిన బీసీఆర్ ట్రస్ట్ నిర్వాహకులు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం డివిజన్లోని చర్ల మండలం రాళ్ల గూడెం గ్రామానికి చెందిన కండెల సమ్మయ్య (70) గత పది రోజులుగా కరోనా వైద్యం పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమిం చడంతో ఆదివారం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మృతి చెందాడు. మృతదేహాన్ని తన స్వగ్రామమైన రాళ్లగూడెం తీసుకెళ్లేం దుకు గ్రామ పెద్దలతో సంప్రదిం చగా కరోనాతో మృతిచెందిన మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురావద్దని ఇక్కడ ఎవరూ సహకరించరని చెప్పారు. దీంతో బంధువులకు సమాచారం అందించినా ఒక్కరూ కూడా పట్టించుకోకుండా ముఖం చాటేశారు. ఒంటరైన మృతుని భార్య సారమ్మ, కొడుకు ఆనంద్‌లు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బండారు చంద్ర రావు (బీసీఆర్) ట్రస్ట్ హెల్ప్ లైన్ సెంటర్‌కు ఫోన్ చేసి తమ గోడు వినిపించారు. వెంటనే స్పందించిన ట్రస్ట్ సభ్యులు గడ్డం స్వామి, భీమవరపు వెంక టరెడ్డి, నకిరేకంటి నాగరాజు, పి.తిరుమలరావులు వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. మృతుని భార్య, కొడుకుల వద్ద చిల్లిగవ్వ కూడా డబ్బు లు లేని దుస్థితిని గమనించిన ట్రస్ట్ సభ్యులు వెంటనే గ్రామ పంచాయతీ ఈవో వెంకటేశ్వరరావుకి ఫోన్ చేసి ఉచితంగా అంత్యక్రియలు నిర్వహించాలని చెప్ప డంతో ఆయన అంగీకరించారు. ఈ క్రమంలో బీసీఆర్ ట్రస్ట్ నిర్వాహకులు సమ్మ య్య మృతదేహాన్ని వైకుంఠధామంకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.