Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరామర్శలు, ఆర్ధిక సాయాలు
నవతెలంగాణ-పినపాక
మీ కష్టసుఖాల్లో కుటుంబ సభ్యుడిగా ఎల్లప్పుడు తోడుగా ఉంటానని ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చా రు. ఆదివారం పినపాక మండలంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, పినపాక మాజీ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లుతో కలసి పొంగు లేటి పర్యటించారు. ఇటీవల అనా రోగ్యానికి గురై మరణించిన కోలేటి భవానీ శంకర్ పెద్ద కుమారుడు కుమా రుడు రవిప్రసాద్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మండలంలోని ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు ఉడు ముల లక్ష్మారెడ్డి ఇటీవల కరోనా బారిన పడి కోలుకోవడంతో వారిని కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసు కున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, రాంబాబు, శ్రీనివా స రెడ్డి, తెరాస మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, పాల్గొన్నారు.
భద్రాచలం : భద్రాచలం టీఆర్ఎస్ నాయకులు నక్కా ప్రసాద్ తల్లి నరసిం హా రత్నం ఇటీవల మృతి చెందారు. భద్రాచలంలో ఆదివారం నిర్వహించిన సంస్కరణ సభకు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి హాజర య్యారు. ముందుగా నరసింహారత్నం చిత్రపటానికి పూలు జల్లి, నివాళులర్పించారు. అనంతరం నక్కా ప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూ తిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతా రావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, బూర్గంపాడు, అశ్వా పురం, మణుగూరు, దుమ్ముగూడెం జడ్పీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
అశ్వాపురం : మండలంలో టీఆఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఖమ్మం మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. తొలుత మిట్టగూడెం గ్రామంలో కరోనాతో మృతి చెందిన కర్రి సీతామహలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి రూ.10వేల ఆర్దిక సాయాన్ని అంద జేసారు. సీతారామపురంలోని దైదా నారాయణరెడ్డిని అదేవిధంగా నెల్లిపాక పీఏసీఎస్ అధ్యక్షుడు తుక్కాని మధు సూ దన్రెడ్డిని పరామర్శించి సాను భూతిని వ్యక్తంచే సారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతా రావు, మాజీ ఎమ్మెల్యే పాయం వెంక టేశ్వర్లు, డీసీసీబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, ఎంపీపీ ముత్తినేని సుజాత, రైతు బందు సమిత అధ్యక్షుడు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు : మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు పోతిరెడ్డి గోవింద రడ్డి కుటుంబాన్ని మాజీ ఎంపీ పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. పట్టణ అధ్యక్షుడు పోతిరెడ్డి గోవింద రడ్డి తండ్రి చిన్న కోటిరెడ్డి ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో చనిపోవడం తెలుసుకొని గోవింద్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన పరామర్శించారు. అదేవిధంగా మండలంలో ఉన్న ఆపదలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులను ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే పాయం, జడ్పీటీసీ కామారెడ్డి శ్రీలత, సొసైటీ చైర్మన్ శ్రీనివాస రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, పాల్గొన్నారు.
పాల్వంచ : కొత్వాల మాతృమూర్తి నారాయణమ్మ పరిపూర్ణమైన, తన నిండైన జీవితాన్ని గడిపి ధన్యజీవి అయ్యారని మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సోదరి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్, పాల్వంచ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు మాతృ మూర్తి కొత్వాల నారాయణమ్మ ఇటీవల మర ణించారు. ఆదివారం పాత పాల్వంచ లోని కొత్వాల స్వగృహానికి పొంగులేటి వెళ్లి, నారాయణమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
పరామర్శించి ప్రగాఢ సాను భూతి సంతాపం తెలిపారు.
ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ కుటుంబ సభ్యులు తల్లి ఆశయాలకానుగుణంగా నడుచుకుంటే ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందని, అప్పుడే ఆమెకు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, టీఆర్ఎస్ నాయకులు తుంబూరి దయాకర్ రెడ్డి, ఆళ్ళ మురళీ, సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, నాయకులు రాజుగౌడ్, ఎస్వీఆర్కే ఆచార్యులు, ముత్తయ్య, నాగరాజు పాల్గొన్నారు.