Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేలి ముద్రలు పడక వృద్ధుల తిప్పలు
- ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలంటున్న పండుటాకులు
నవతెలంగాణ-అశ్వాపురం
రూపాయి బియ్యమైన రూలు రూలే అన్న విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో కొనసాగుతోంది. ఎవ్వరికైన సరే కళ్ళు గాని వేలుముద్రలు గాని పడితేనే రేషన్ షాపుల్లో బియ్యం అంటున్నారు రేషన్ డీలర్లు. దీంతో ఇప్పుడు పండుటాకుల పరిస్థితి దీనంగా మారింది. రేషన్ షాపుల్లో బియ్యం తీసుకోవాలంటే వృద్ధులు పరేషన్ అవుతుండ్రు. రేషన్ బియ్యంకు ఐరీష్, వేలిముద్రలు తప్పని సరిచేయడంతో పండుటాకులకు పాట్లు తప్పడంలేదు. ఇటువంటి పరిస్థితి ఏ ఒక్క మండలానిదిదో జిల్లాదో కాదు. తెలంగాణ రాష్ట్రం మొత్తం నెలకొని ఉన్న పరిస్థితి ఇది. ప్రత్యేకంగా వృద్ధులే ఉన్న రేషన్ కార్డులో వృద్దులెవ్వరికీ వేలిముద్రలు, ఐరీష్లు తీసుకోక పోవడంతో సౌకబియ్యానికి దూరం అవుతున్నారు. ప్రతీ నెల వచ్చే రేషన్ బియ్యం, పింఛన్తోటే కాలం జీవనం సాగించేవారికి వేలిముద్రల సమస్య వలన బియ్యం అందక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.
వృద్ధులకు బియ్యం ఇచ్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి