Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో 1998-1999 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు తమతో పాటు చదువుకుని ఇటీవల కరోనాతో మరణించిన తూరుబాక గ్రామానికి సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చెందిన జోగ నర్సయ్య కుటుంబాన్ని ఆదివారం పరామర్శించి రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా మండల కేంద్రానికి చెందిన వూకె రమణ భర్త ఇటీవల కాలంలో అనారోగ్యంతో చనిపోగా వారి కుటుంబానికి కూడా రూ.5వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... అన్ని బంధాలకన్నా స్నేహబంధం గొప్పదని, స్నేహితుడు ఆపదలో ఉంటే ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడని వారన్నారు. ఈ కార్యక్రమంలో పెండెకట్ల కాంతారావు, వాంకుడోత్ అజరు, రాంబాబు, రాజశేఖర్, పార్వతి తదితరులు పాల్గొన్నారు.