Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం రైతుబంధు అందరికీ వర్తింపచేయాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖరీఫ్ పంటల సీజన్ ప్రారంభమై, ఇప్పటికే జిల్లాలో కొన్నిచోట్ల మెట్ట పంటలు వేశారని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు వ్యవసాయ ప్రణాళిక, ఋణ ప్రణాళిక విడుదల చేయలేదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపైన పార్టీ జిల్లా కార్యాలయం సుందరయ్య భవనం వద్ద పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ధర్నా సభలో ఆయన మాట్లాడుతూ రైతులు విత్తనాలు, ఎరువుల కోసం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని, కల్తీ విత్తనాల బెడద కూడా తీవ్రంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి ఈ సీజన్లో 75 లక్షల ఎకరాల్లో పత్తి వేయాలని ప్రకటించారని, కానీ అందుకు తగిన విత్తనాలు మండల కేంద్రాలలో అందుబాటులో ఉంచడంలో విఫలమ య్యారన్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని కల్తీ వ్యాపారులు రెచ్చిపోయి తమ కల్తీ దందా కొనసాగిస్తున్నారని, పాలకూర నుండి పత్తి విత్తనాల వరకు కోట్ల రూపాయల్లో కల్తీ విత్తనాలు పట్టుబడుతున్నట్లు రోజూ వార్తలు వస్తున్నాయని నున్నా తెలిపారు. నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకొని, వారి లైసెన్స్‌లు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకం ఒకేసారి కాకుండా, వాయిదాలలో మాఫీ చేయడం వల్ల రైతులు బ్యాంకుకు బాకీ ఉండటంతో తిరిగి కొత్త రుణాలు ఇవ్వడం లేదని, ఈ 7 సం.లలో జిల్లాలో సుమారుగా 5 లక్షల మంది రైతులు వుండగా, 3 లక్షల మందికే బ్యాంకులు రుణాలు అందుతున్నాయని, 2 లక్షలకు పైగా రైతులు ఇంతవరకు బ్యాంకు గడప తొక్కలేదని అన్నారు. కొత్తవారికి అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయని, ఇచ్చిన అప్పులకు కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అమలు జరగటం లేదన్నారు. అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు తెచ్చుకొంటు న్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు ఇప్పటి వరకు విడుదల చేయలేదని, ఒకవేళ విడుదల చేసినా, ఆ పెట్టుబడి పంటలకు సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల కేంద్రం ప్రకటించిన మద్ధతు ధరలతో రైతులకు వాస్తవ వ్యవసాయ పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధరల నిర్ణాయక సంఘాలు వేసి, ఉత్పత్తిని శాస్త్రీయంగా లెక్కవేసి, దానికి 50% అదనంగా కలిపి మద్ధతు ధర నిర్ణయించి, అమలు చేయాలన్నారు. దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాల లాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ధరల నిర్ణాయక కమీషన్ వేసి కూరగాయల పంటలతో సహా, అన్ని పంటలకు మద్ధతు ధరలు నిర్ణయించాలన్నారు. కౌలు రైతులకు గుర్తింపు లేనందున రైతుబంధు పథకం వారికి అమలు కావడం లేదని, దీనితో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారికి వెంటనే 2011 చట్టం ప్రకారం గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రైతుబంధు విడుదల చేసి తమ పని అయిపోనట్లు భావిస్తూ, విపరీతంగా పెరిగిపోతున్న విత్తనాలు, ఎరువుల ధరలను అదుపు చేయకపోవడంతో ఖర్చులు పెరిగి, గిట్టుబాటు కాక రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నున్నా ఆరోపించారు. సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు యివ్వాలని కోరారు. రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో రైతు ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని నున్నా తెలిపారు.
జిల్లా ఇన్ఛార్జ్ వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరెడ్డిని కలిసిన పార్టీ ప్రతినిధి బృందం
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ, యాసంగి పంట కొనుగోళ్ళు ఇంకా పూర్తికాలేదని, కొనుగోలు చేసిన పంటకు రైతులకు నేటికీ డబ్బు చెల్లించలేదని, కాటాలు వేసిన ధాన్యాన్ని ట్రాన్స్పోర్ట్ చేయలేదని, ఇటీవల కురిసిన వర్షాలకు కల్లాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అలాగే జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పార్టీ జిల్లా ప్రతినిధి బృందం ఇన్ఛార్జ్ డి.ఎ.ఓ. (జిల్లా వ్యవసాయ శాఖ అధికారి) శ్రీనివాసరెడ్డిని కలిసి మెమోరాండం అందజేసింది.
కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు బుగ్గవీటి సరళ, జిల్లా కమిటీ సభ్యులు మాదినేని రమేష్, యర్రా శ్రీనివాసరావు, వై.విక్రం, మెరుగు సత్యనారాయణ, బండి పద్మ, టి.లింగయ్య, నందిపాటి మనోహర్, జబ్బార్, నాయకులు మెరుగు రమణ, నర్రా రమేష్, జమ్మి అశోక్, ఆర్.ప్రకాష్, కాంపాటి వెంకన్నతదితరులు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం : సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. తహశీల్దార్ జగదీశ్వర ప్రసాద్ అందుబాటులో లేకపోవడంతో ఆర్ఐ యాకూబ్ భాషాకి వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య, రైతులు లగడపాటి అప్పారావు, జార్జి టెన్నీన్షన్, సుబ్బారెడ్డి, ఆంగోతు వెంకటేశ్వర్లు, తాళ్లూరి వెంకటనారాయణ, నల్లబోతుల హనుమంతరావు, శ్యామలరావు, ఆవుల వెంకటేశ్వరావు, పోతురాజు బాబు, నాగులవంచ వెంకట్రామయ్య, తదితరులు పాల్గొన్నారు.
పెనుబల్లి : తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతుసంఘం, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డిప్యూటీ తహశీల్దార్ షేక్ అతీక్ అహ్మద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి చలమల విఠల్‌రావు, రైతు సంఘం మండల అధ్యక్షుడు మామిండ్ల వెంకటేశ్వర్లు, పార్టీ మండల నాయకులు గాయం తిరుపతిరావు, చలమాల నరసింహారావు, ఏం.బాజీ, కోనకాల వెంకటేశ్వర రావు, బెజవాడ సాయి, ప్రేమ్‌కుమార్, రాజేష్, రాంబాబు వేంకటేశ్వరరావు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు .
కారేపల్లి : రైతు సమస్యలపై సీపీఐ(ఎం) సోమవారం తహసీల్ధార్ కార్యాలయం ఎదుట నిరస కార్యక్రమాన్ని చేపట్టింది. అనంతరం తహసీల్ధార్ డీ.పుల్లయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండలకార్యదర్శి కే.నరేంద్ర, నాయకులు తలారి దేవప్రకాశ్, ముండ్ల ఏకాంభరం, అన్నారపు కృష్ణ, కరకపల్లి రామయల్లు, మాలోత్ రాంకోటి, వై.రాంబాబు, లింగయ్య పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం : స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహశీల్దార్ రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి అంగిరేగుల నర్సయ్య, నాయకులు కొమ్ము ఎను, బింగి రమేష్, కొత్తపల్లి వెంకన్న, పొలిబోయిన ముత్తయ్య, జి.ఉపేందర్, బి.రాములు, ధర్మచారి తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్ : సీపీఎం ఆధ్వర్యంలో మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవనం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ తాసిల్దార్ కరుణ శ్రీకి అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, నాయకులు తుమ్మల శ్రీనివాసరావు, పి.మోహన్‌రావు, బందెల వెంకయ్య, ఏడుకొండల నాగేశ్వరరావు, తిరుమల శ్రీనివాసరావు, నూకల బాలరాజు, గురవయ్య, నాగేశ్వరరావు, మహిపాల్ రెడ్డి,గోగుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కామేపల్లి : పోడు సాగు రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి కృష్ణ డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌కి వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి అంబటీ శ్రీనివాసరెడ్డి ,సామ మోహన్‌రెడ్డి, కాటాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
మధిర: సీపీఎం, రైతు సంఘం ఆద్వర్యంలో తహశీల్దార్ డి.సైదులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి శీలం నరసింహారావు, మండల కార్యదర్శి సైదులు, మల్లారం సర్పంచ్ ఉపేందర్‌రావు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మధు, ఊట్ల శంకర్ రావు, రాధాకృష్ణ, కాజా రాములు పాల్గొన్నారు.
ముదిగొండ : ముదిగొండ ప్రధాన రహదారిపై సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వాసిరెడ్డి వరప్రసాద్, రైతు సంఘం మండల అధ్యక్షకార్యదర్శ కందుల భాస్కర్ రావు, కోలేటి ఉపేందర్, వైస్‌ఎంపీపీ మంకెన దామోదర్, సిఐటియు మండల కన్వీనర్ టిఎస్ కళ్యాణ్, వ్యకాస మండల కార్యదర్శి వేల్పుల భద్రయ్య, రైతుసంఘం నాయకులు పయ్యావుల పుల్లయ్య, సొసైటీ డైరెక్టర్ రాయల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
వైరాటౌన్ : ఖమ్మం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్నా సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ(ఎం) జిల్లా కమిటీ పిలుపు మేరకు వైరా తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం రైతులు నిరసన వ్యక్తం చేసి తహశీల్దార్ రంగాకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, సిపిఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, మండల కార్యదర్శి తోట నాగేశ్వరావు, మాజీ ఎంపిపి బొంతు సమత, నాయకులు కురగుంట్ల శ్రీనివాసరావు, హరి వెంకటేశ్వరరావు, పైడిపల్లి సాంబశివరావు, కామ్మినేని రవి, గుమ్మా మురళి రైతు నాయకులు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.