Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
ప్రపంచ యూత్ ఐకాన్ చేగువెర 93వ జయంతి కార్యక్రమం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) జిల్లా కమిటి ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా సహయ కార్యదర్శి పదముత్తుం ఉష అధ్యక్షతన జరిగిన సభలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ రంజాన్, ప్రముఖ లెక్చరర్ బండారు రమేష్ మాట్లాడుతూ నేటి యువత నిరంతరం అధ్యయనం అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు కూరపాటి శ్రీను, కణపర్తి గిరి, రావులపాటి నాగరాజు, యాటా రాజేష్, వేముల సాంబ, కోండల్, ప్రవీణ్, రాజేష్, మంగయ్య, మదు, అనిల్ ముళ్ళపూడి రామారావు తదితరులు పాల్గొన్నారు.
వేంసూరు : ప్రపంచ విప్లవ కారుడు, మార్క్సిస్ట్ యోధుడు చేగువేరా జయంతిని మర్లపాడులో సీపీఎం, సీఐటీయూల అధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ నేటి పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ ఓడించడమే చేగువేరాకు ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో:సీపీఎం, సీఐటీయూ అనుబంధ భవన నిర్మాణ కార్మికులు దొడ్డే సత్యనారయణ, దానే గౌరీ శంకర్, దానే మధు, డంకర సాయి, పాషా, యాసిన్, కరిముల్ల, బర్ల చెన్నయ్య, బండ కిట్టు పాల్గొన్నారు.
పెనుబల్లి: డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో చేగువేరా జయంతిని డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి బెజవాడ సాయి శేషు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చలమాల విఠల్, ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు చలమాల నరసింహారావు, డీవైఎఫ్ఐ మండల నాయకులు దెంకేన సతీష్, ఎస్ఎఫ్ఐ సత్తుపల్లి కార్యదర్శి ప్రేమ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మధిర: స్థానిక బోడేపూడి భవన్లో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నరమనేని అనిల్ అధ్యక్షతన చేగువేరా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మధు, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి షేక్ సైదులు, ఎస్ఎఫ్ఐ నాయకులు పేరు స్వామి, హర్షవర్ధన్, గణేష్ రవి పాల్గొన్నారు.
వైరాటౌన్ : చేగువేరా 93వ జయంతిని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో స్థానిక బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ వైరా పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు నోయెల్, నాగరాజు మాట్లాడారు. కార్యక్రమంలో నవీన్, సాయిగణేష్, భగత్, సారదు తదితరులు పాల్గొన్నారు