Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైరస్ను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
ఎం. వెంకటాయపాలెం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కరోనా బాధితులకు, కోవిడ్ పరీక్షల కోసం వచ్చే వారికి, వ్యాక్సిన్ వేయించుకునేందుకు వచ్చే ప్రతి ఒక్కరికి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని పార్టీ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ కరోనా మహమ్మారిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయన్నారు. కోవిడ్ లాంటి విపత్తి సంభవించినప్పుడు ప్రభుత్వాలు ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం సిగ్గు చేటన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో 100 పడకలతో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని, కోవిడ్ బాధితులకు రోజుకు 500 మందికి ఇంటికే భోజనాలు సరఫరా చేస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి ఉన్నని రోజులు పిహెచ్సి కేంద్రానికి వచ్చే రోగులకు, బాధితులకు ప్రతిరోజు ఉచితంగా టిఫిన్ అందజేయడం జరుగుతుందన్నారు. విపత్తుల సమయంలో సీపీఎం పేద ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. దేశంలో ఉన్న ప్రజలందరికీ త్వరగా ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి టిఫిన్ ఏర్పాటు చేసిన సీపీఎం మండల కమిటీని నున్నా నాగేశ్వరరావు, డాక్టర్ శ్రీదేవి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బందెల వెంకయ్య, తుమ్మల శ్రీనివాసరావు, పొన్నం వెంకటరమణ, సిలివేరు బాబు, మండల కమిటీ సభ్యులు పుచ్చకాయల నాగేశ్వరరావు, చావా నాగేశ్వరరావు, కూసు సంజీవరెడ్డి, వడ్లమూడి నాగేశ్వరరావు, జక్కంపూడి నాగేశ్వరరావు, కెవిపిఎస్ మండల కార్యదర్శి పాపిట్ల సత్యనారాయణ, కోట్టి రామయ్య, రెంటాల నాగేశ్వరరావు, కూసు పుల్లారెడ్డి, చాలిన నాగేశ్వరరావు, నండ్ర రవి, ఏపూరి వర కుమార్, మునిగంటి కృష్ణ, బేతంపూడి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.