Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐ జోక్యంతో కిందకు దిగిన యువకుడు
నవతెలంగాణ-ములకలపల్లి
ఎస్సై తన సమస్య పరిష్కరించలేదని సోమవారం మండల కేంద్రంలో సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్ చల్ చేశాడు. ఇదే సంవత్సరం ఏప్రిల్ 3న బాధితుడు ఇదే సెల్ టవర్ ఎక్కి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. నాడు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సమస్య రెండు మాసాలు దాటినా పరిష్కరించక పోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. స్థానికులతో పాటు బాధితుడు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పొగళ్లపల్లి గ్రామానికి చెందిన కమ్మాకుల నాగేంద్ర బాబు పెనుబల్లి మండలం లింగగూడెంలో గత సంవత్సరం రూ.4.30 లక్షలకు డోజర్ కొనుగోలు చేసి ఒప్పందం ప్రకారం రూ.2.10 లక్షలు కట్టి డోజర్ తెచ్చుకున్నాడు. మిగిలిన డబ్బుకు నెలనెలా వడ్డీ చెల్లిస్తూ బాకీ తీర్చుకుంటు న్నాడు. ఈ క్రమంలో అమ్మకం దారు లింగగూడెంకు చెందిన పల్లపు కృష్ణారావు దౌర్జన్యంగా డోజర్ తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. పెద్ద మనుషుల సమక్షంలో స్థానిక పోలీసు స్టేషన్లో బండిని ఉంచారు.
రెండు రోజుల అనంతరం స్టేషన్ సిబ్బంది నాగేంద్ర బాబుకు సమాచారం ఇవ్వకుండా డోజర్ విడిచిపె ట్టారు. ఈ విషయంలో తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని పోలీసు లను నిలదీశాడు. ఫలితం లేకపోవడంతో కనీసం కేసు నమోదు చేయాల్సిందిగా స్టేషన్ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. దీంతో రెం డు నెలల క్రితం సెల్ టవర్ ఎక్కి నిర సనకు దిగాడు. అధికారుల హామీతో కిందకు దిగిగాడు. నాటి నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీతో సహా ఇతర అధికా రుల చుట్టూ తిరుగుతున్నా పట్టిం చుకోక పోవడంతో తిరిగి సెల్ టవర్ ఎక్కినట్టు బాధితుడు తెలిపాడు.
పరిస్కారం దిశగా చర్చలు
పాల్వంచ సీఐ సత్యనారాయణ చొరవతో టవర్ దిగిన అనంతరం కృష్ణారావును పిలిపించి బాధితుడి కుటుంబంతో చర్చలు జరుపుతున్నారు. సమస్య తిరిగి పునరావృతం కాకుండా ప్రయత్నాలు చేస్తు న్నట్టు పోలీసులు సీఐ సత్యనారాయణ తెలిపారు.