Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర గవర్నర్ తమిళసై
నవతెలంగాణ-భద్రాచలం
యువకులందరూ రక్తదానంలో పాల్గొనాలని రాష్ట్ర గవర్నర్, ఐఆర్సీఎస్ రాష్ట్ర అధ్యక్షులు తమిళసై సౌందర్య రాజన్ అన్నారు. సోమవారం ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ జిల్లాల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మెన్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భ ంగా గవర్నర్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి రక్తదానంలో పాల్గొనాలని అన్నారు. రెడ్ క్రాస్ శాఖలు రక్తదాన శిబిరాలు విరివిగా నిర్వహించా లని ఆమె అన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎస్.ఎల్. కాంతారావు మాట్లాడుతూ... గత ఏడాది 2500 మందికిరక్తం అందించామని తెలిపారు. అలాగే డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న 500 మందికి సింగిల్ డోనార్ ఫ్లేట్ లైట్స్ అందించామని అన్నారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ ఆదివాసీలు, గిరిజనులు తలసేమియా వ్యాధితో బాధ పడుతున్నారని అన్నారు. వారి సంక్షేమం కోసం రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు ద్వారా తలసేమియా, సికిల్ సెలేమియా చికిత్స కేంద్రంలో ఆరోగ్యశ్రీ స్కీమ్‌లో ఏర్పాటు చేయాలని, ఇందుకు సహకారాన్ని అందించాలని గవర్నర్‌ను కోరారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా 15 మంది స్వచ్ఛంద రక్తదానం చేశారు. రక్తదాన శిబిరం ఏర్పాటు రక్షణ సేవా ఫౌండేషన్ అధ్యక్షులు గుమ్మడి రాజును సన్మానిం చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ ఎల్ కాంతారావు, యోగి సూర్యనా రాయణ, రాజా రెడ్డి, తిప్పన సిద్దులు, పల్లంటి దేశప్ప, జి.భూపతి రావు, కె.రవికుమార్, అది, గుమ్మడి రాజు తదితరులు పాల్గొన్నారు.