Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు వేదికలు వాడుకలోకి తీసుకురావాలి
- అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామాలు పూర్తిచేయాలి
- జెడ్పీ సీఈఓ ఎం.ఆశాలత
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర ముఖ్య మంత్రి తెలిపిన విధంగా పల్లె ప్రగతి, పల్లెలు పచ్చదనంతో విరసిల్లాలని, మండలంలో రైతు వేదికలు వాడుకలోకి తీసుకు రావాలని, మండలంలో అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామాల నిర్మాణాలు వెంటనే పూర్తిచేయాలని జిల్లా పరిషత్ సీఈఓ మెరగు ఆశాలత అన్నారు. సోమవారం జెడ్పీ సమావేశ మందిరంతో మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచ్లు, కార్యదర్శులు ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రభలే ప్రమాదం ఉందని, పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని, వారానికి 3 రోజులు దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని, అందరూ ఆరోగ్యంగా ఉండే విధంగా చైతన్యం పెంచాలని సూచించారు. పల్లె ప్రకృతి వనాల పర్యవేక్షణ పెంచాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సూచించిన విధంగా అన్ని రంగాల్లో చుంచుపల్లి మండల అభివృద్ధి పెంచాలని ఆదేశించారు. ఈనెల 19వ తేదీ నుండి ఆకస్మిక తనిఖీలు చేయనున్నారని, హరితహారం కార్యక్రమంలో నర్సరీలలో పెంచిన మొక్కటను ప్రతిఇంటికి 6 చొప్పున అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో చుంచుపల్లి ఎంపీడీఓ సకినాల రమేష్, మండల పంచాయతీ అధికారి గుంటి సత్యనారాయణ, పెనగడప మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక, అన్ని పంచాయతీల సర్పంచ్లు, కార్యదర్శులు, ఇజీఎస్ ఏపిఒ, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.