Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
- ఎన్ఆర్ఐ ఫౌండేషన్, నవచైతన్య ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ
నవతెలంగాణ- సత్తుపల్లి
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను సత్తుపల్లి మండలం తుమ్మల నగర్ ప్రజలు దరిచేరనీయక పోవడాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం తుమ్మలనగర్ ప్రజలకు డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్, నవచైతన్య సేవా సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అక్కడి ప్రజలకు రూ. 25 వేల విలువగల నిత్యావసరాలు, కూర గాయలను ఎమ్మెల్యే సండ్ర చేతుల మీదుగా వితరణ అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ గ్రామాన్ని వదలని కరోనా తుమ్మలనగర్ ప్రజలు తీసుకున్న జాగ్రత్తల వల్ల కరోనా ఈ గ్రామాన్ని తాకేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. ఇదే రీతిన ప్రతి గ్రామంలో ఈ రకంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కరోనా రహిత గ్రామంగా తయారు కావొచ్చన్నారు. ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బయ్యన బాబూరావు మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో జీవించే ఈ ప్రాంత ప్రజలకు ఇకపై కూడా కరోనా సోకకుండా ఉండాలంటే కొత్త వ్యక్తులకు దూరంగా ఉండాలన్నారు. ఇక్కడి ప్రజలు నిత్యావసరాల కోసం పట్టణానికి వెళ్లకుండా వీరికి అవసరమైన నిత్యావసరాలను అందించడం జరిగిందని సంస్థ బాధ్యులు బండి నాగేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో నవచైతన్య అధ్యక్ష, కార్యదర్శులు గాదె నరసింహారెడ్డి, తోట కిరణ్, గ్రామ సర్పంచ్ ఇరపా లలిత, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకరరావు, ఎంపిడిఓ చిట్యాల సుభాషిణి, నాయకులు కొడిమెల అప్పారావు, పాలకుర్తి రాజు, సంస్థ డైరెక్టర్లు మాదిరాజు పుల్లారావు, మోరంపుడి జగదీష్, మైలమాల యేసయ్య, రాగం శ్రీను, సయ్యద్ ముస్తఫా, పాలకొల్లు శ్రీనివాసరావు, సునీల్, కోట శివ నాగరాజు, మారయ్య పాల్గొన్నారు.